Advertisement

తెలంగాణ బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత

By: chandrasekar Sat, 21 Nov 2020 5:36 PM

తెలంగాణ బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత


తెలంగాణలో కాంగ్రెస్‌కు గ్రేటర్ ఎన్నికల వేళ మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కాంగ్రెస్‌కు బై బై చెప్పబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేసారు. అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ ఆయన్ను కలిసి బీజేపీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్ మహేంద్రహిల్స్‌లోని సర్వే సత్యనారాయణ ఇంటికి వెళ్లి ఆయన్ను ఆహ్వానించడం విశేషం. దీంతో వారి అభ్యర్థనను సర్వే సత్యనారాయణ స్వాగతించారు.

సమావేశం అనంతరం సర్వే సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ... త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. బీజేపీలో చేరాలని బండి సంజయ్, వివేక్ కోరారని పేర్కొన్నారు. ప్రొటోకాల్ ప్రకారమే బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా తనతో పాటు చాలా మందిని బీజేపీలో చేర్పిస్తానని సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బలాంటిదే. ఇప్పటికే దుబ్బాకలో ఓటమి పాలై దయనీయ స్థితిలో ఉన్న ఆపార్టీకి ఇలా సీనియర్లంతా మరో పార్టీ లోకి వెళ్లడం పెద్ద షాక్.

Tags :
|
|

Advertisement