Advertisement

  • జాదవ్‌ నిరుపయోగ అలంకరణ వస్తువుగా ఉన్నాడని ఘాటైన వ్యాఖ‌్యలు చేసిన సెహ్వాగ్

జాదవ్‌ నిరుపయోగ అలంకరణ వస్తువుగా ఉన్నాడని ఘాటైన వ్యాఖ‌్యలు చేసిన సెహ్వాగ్

By: chandrasekar Sat, 10 Oct 2020 7:42 PM

జాదవ్‌ నిరుపయోగ అలంకరణ వస్తువుగా ఉన్నాడని ఘాటైన వ్యాఖ‌్యలు చేసిన సెహ్వాగ్


సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ఈ ఐపీఎల్ ఈ సీజన్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నైకి ఓ దశలో విజయానికి చేరువగా వచ్చింది. కోల్‌కతా నిర్దేశించిన 168 పరుగులనే చేధించేందుకు బరిలో దిగిన ధోని సేన తొలి ఓవర్లలో బాగానే రాణించింది. ఒక దశలో 10 ఓవర్లలో 79 పరుగులు చేయాల్సి వచ్చింది. కానీ ఆ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 10 పరుగులతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో చేజింగ్ సమయంలో బ్రావో, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా కన్నా ముందు కేదార్ జాదవ్ ను తీసుకున్న నిర్ణయాన్ని పలువురు విశ్లేషకులు తప్పుబడుతున్నారు.

ఈ నేపథ్యంలో సెహ్వాగ్ మాట్లాడుతూ "ఆ లక్ష్యాన్ని చేధించి ఉండాల్సింది. కానీ కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా ఆడిన డాట్ బాల్స్ ఏ విధంగా ఉపయోగపడలేదు. నా అభిప్రాయం ప్రకారం కొందరు చైన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ సీఎస్‌కే వైపు ఆడటం ప్రభుత్వ ఉద్యోగంగా భావిస్తున్నారు. సరిగ్గా ఆడిన, ఆడకపోయినా వాళ్ల జీతాలు అందుతాయని తెలుసు"అని సెహ్వాగ్ క్రిక్‌బజ్‌కు తెలిపాడు. ఇంకా సెహ్వాగ్ ఫేస్‌బుక్ సీరిస్‌ వీరు కీ బైఠక్‌లో కూడా జాదవ్ ఆటతీరుపై విమర్శలు చేశాడు. జాదవ్‌ నిరుపయోగ అలంకరణ వస్తువుగా ఉన్నాడని ఘాటైన వ్యాఖ‌్యలు చేశాడు. 12 బంతుల్లో 7 పరుగులు చేసిన జాదవ్‌కు మ్యాన్‌‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ ఇవ్వాల్సిందని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా, ఇప్పటివరకు 8 సార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేరిన ధోని నేతృత్వంలోని సీఎస్‌కే.. ఈ ఏడాది మాత్రం అనుకున్న౦తగా రాణించలేకపోతోంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు చెన్నై ఓడిపోయింది. ఇక, శనివారం జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై జట్టు తలపడనుంది.

Tags :
|
|

Advertisement