Advertisement

  • కశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో నలుగురు ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేసిన భద్రతా దళాలు

కశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో నలుగురు ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేసిన భద్రతా దళాలు

By: chandrasekar Sat, 29 Aug 2020 09:42 AM

కశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో నలుగురు ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేసిన భద్రతా దళాలు


కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు ఎన్కౌంటర్ చేశారు. దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లో భద్రతా దళాలు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. గతంలో జమ్మూ కశ్మీర్ పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేసి టెర్రరిస్ట్‌గా మారిన షాకూర్ అహ్మద్ పర్రే కూడా ఈ కాల్పుల్లో చనిపోయినట్లు గుర్తించారు. షాకూర్ అహ్మద్ నాలుగున్నరేళ్ల క్రితం అనంతనాగ్ జిల్లాలోని బిజ్బేహర పోలీస్ స్టేషన్ నుంచి నాలుగు ఏకే-47 తుపాకీలతో పరారయ్యాడు. అనంతరం అల్ బదర్ అనే ఉగ్రవాద గ్రూప్‌ను ఏర్పాటు చేసి షోపియాన్ జిల్లా కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు.

స్పెషల్ పోలీసు ఆఫీసరుగా పని చేసిన అతను తర్వాత కానిస్టేబుల్ ఆపై ఉగ్రవాదిగా మారిన షాకూర్ పది మంది యువకులను ఉగ్రవాదులుగా మార్చాడు. వీరిలో ఇప్పటికే ఐదుగుర్ని మట్టుబెట్టామని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. షోపియాన్ ఎన్‌కౌంటర్‌లో షాకూర్‌తో చనిపోయిన మరో టెర్రరిస్ట్‌ను సుహైల్ భట్‌‌గా గుర్తించారు. అతడు ఖన్మోమ్ గ్రామ సర్పంచ్‌ను కిడ్నాప్ చేసి హంతమొందించాడు. ఉగ్రవాదుల దగ్గర్నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని భద్రతా బలగాలు తెలిపాయి.

కశ్మీర్‌లోని కిలూరా ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు చనిపోయారని ఒకరు లొంగిపోయారని, సంయుక్త ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఇండియన్ ఆర్మీ తెలిపింది. కిలూరా ప్రాంతంలోని ఓ తోటలో 4 నుండి 5 ఉగ్రవాదులు ఉన్నారని షోపియాన్ పోలీసులకు సమాచారం అందింది. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టగానే ఉగ్రవాదుల్లో ఒకరు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్ లో నలుగురు చనిపోగా ఒకర్ని పట్టుకున్నాం. మరింత వివరాల కొరకు అతణ్ని ప్రశ్నిస్తున్నాం అని కశ్మీర్ ఐజీ తెలిపారు. గతంలోకంటే ఇప్పుడు తీవ్రవాదులు బాగా తగ్గినట్లు తెలిపారు.

Tags :

Advertisement