Advertisement

కోల్‌క‌తాలో బీజేపీ ఆందోళ‌న వల్ల 144 సెక్ష‌న్

By: chandrasekar Fri, 09 Oct 2020 2:37 PM

కోల్‌క‌తాలో బీజేపీ ఆందోళ‌న వల్ల 144 సెక్ష‌న్


కోల్‌క‌తాలో బీజేపీ ఆందోళ‌న వల్ల 144 సెక్ష‌న్ విధించారు. ప‌శ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌తాలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. బెంగాల్‌లో అధికార తృణ‌మూల్ కాంగ్రెస్ హ‌త్యారాజ‌కీయాలకు పాల్ప‌డుతోందంటూ బీజేపీ గురువారం భారీ ఆందోళ‌న‌కు సిద్ధ‌ప‌డ‌టం, దాంతో కోల్‌క‌తా పోలీసులు న‌గ‌రంలో భారీగా బ‌ల‌గాల‌ను మోహరించ‌డం లాంటి ప‌రిణామాలు వాతావ‌ర‌ణాన్ని ఒక్క‌సారిగా ఉద్రిక్తంగా మార్చాయి.

పోలీసులు న‌గ‌రం అంత‌టా 144 సెక్ష‌న్ విధించడంతోపాటు బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యం వ‌ద్ద భారీగా బ‌ల‌గాల‌ను మోహరించారు. ఆనతికాలంగా రాష్ట్రంలో అధికార‌పార్టీ త‌మ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని హ‌త్య‌లు చేయిస్తున్న‌ద‌ని బీజేపీ ఆరోపిస్తున్న‌ది. హ‌త్యారాజ‌కీయాల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌డం కోసం గురువారం భారీ ఆందోళ‌న‌కు పూనుకుంది.

తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ మేర‌కు కోల్‌క‌తాలోని పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యం నుంచి న‌బ‌న్నాలోని రాష్ట్ర స‌చివాలయం వ‌ర‌కు భారీ నిర‌స‌న ర్యాలీ నిర్వ‌హించ త‌లపెట్టింది. దీంతో పోలీసులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా అడుగ‌డుగునా బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Tags :
|
|

Advertisement