Advertisement

  • ఐపీఎల్ 2020 ప్లేఆఫ్ లో టాప్-2లోని జట్లకి రెండో ఛాన్స్...

ఐపీఎల్ 2020 ప్లేఆఫ్ లో టాప్-2లోని జట్లకి రెండో ఛాన్స్...

By: chandrasekar Wed, 04 Nov 2020 2:55 PM

ఐపీఎల్ 2020 ప్లేఆఫ్ లో టాప్-2లోని జట్లకి రెండో ఛాన్స్...


మంగళవారంతో ఐపీఎల్ 2020 సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసిపోయాయి ప్లేఆఫ్ జట్లపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. పాయింట్ల పట్టికలో ముంబయి ఇండియన్స్ 18 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలవగా.. ఆ తర్వాత వరుసగా ఢిల్లీ క్యాపిటల్స్ (16), సన్‌రైజర్స్ హైదరాబాద్ (14), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (14) టాప్-4లో చోటు దక్కించుకుని ప్లేఆఫ్‌లో అడుగుపెట్టాయి. వాస్తవానికి ఐదో స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కూడా మంగళవారం రాత్రి వరకూ 14 పాయింట్లతో ప్లేఆఫ్ రేసులోనే ఉంది. కానీ.. ముంబయి‌ని షార్జాలో 10 వికెట్ల తేడాతో మంగళవారం ఓడించిన హైదరాబాద్ (+0.608) మెరుగైన నెట్‌ రన్‌రేట్ సాయంతో ప్లేఆఫ్‌లో అడుగుపెట్టగా.. కోల్‌కతా (-0.214) ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (12), చెన్నై సూపర్ కింగ్స్ (12), రాజస్థాన్ రాయల్స్ (12) ఆరేసి విజయాలతో పట్టికలో చివరి మూడు స్థానాల్లో నిలిచి టోర్నీ నుంచి వెళ్లిపోయాయి.

పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్ల మధ్య ప్లేఆఫ్ మ్యాచ్‌లు గురువారం (నవంబరు 5) నుంచి ప్రారంభంకానున్నాయి. దుబాయ్ వేదికగా జరిగే క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో టాప్-2లోని ముంబయి, ఢిల్లీ జట్లు తలపడనుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టనుంది. ఓడిన జట్టుకి క్వాలిఫయర్-2లో ఆడి ఫైనల్‌కి చేరే మరో అవకాశం ఉంటుంది. పట్టికలో ఇక మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన హైదరాబాద్, బెంగళూరు జట్లు శుక్రవారం అబుదాబి వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటికి వెళ్లనుండగా.. గెలిచిన జట్టు.. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుతో అబుదాబి వేదికగానే ఆదివారం క్వాలిఫయర్-2లో ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మంగళవారం దుబాయ్‌లో ఫైనల్లో ఆడనుంది. మ్యాచ్‌లన్నీ భారత కాలమాన ప్రకారం రాత్రి 7.30 గంటలకి ప్రారంభం కానున్నాయి.

Tags :
|
|
|

Advertisement