Advertisement

  • నవంబర్‌లో భారత్‌కు రెండో బ్యాచ్‌ రాఫెల్ యుద్ధ విమానాలు

నవంబర్‌లో భారత్‌కు రెండో బ్యాచ్‌ రాఫెల్ యుద్ధ విమానాలు

By: chandrasekar Fri, 16 Oct 2020 12:26 PM

నవంబర్‌లో భారత్‌కు రెండో బ్యాచ్‌ రాఫెల్ యుద్ధ విమానాలు


భారత లో మొదటి బ్యాచ్ రాఫేల్ యుద్ధ విమానాలు వచ్చి చేరిన సంగతి తెలిసిందే. వచ్చే నెల నవంబర్‌లో రెండో బ్యాచ్‌ రాఫెల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు రానున్నాయి. ఈ మేరకు భారత వాయుసేన యుద్ధ విమానాల రవాణా, పైలట్లకు శిక్షణ కోసం ఒక బృందాన్ని ఫ్రాన్స్‌ కు పంపింది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో రెండో బ్యాచ్‌ రాఫెల్‌ యుద్ధ విమానాలు కూడా భారత్‌కు చేరవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మొదటి విడతలో వచ్చిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు జూలై 29న భారత్‌కు చేరిన సంగతి తెలిసిందే. రాఫెల్స్ కోసం అంబాలా ఎయిర్‌ బేస్‌లో ‘గోల్డెన్‌ యారోస్‌’ అనే పేరుతో కొత్త ఎయిర్‌ స్క్వాడ్రన్‌ను సైతం అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రాఫెల్స్‌ను సెప్టెంబరు 10న అధికారికంగా భారత వాయుసేనలోకి ప్రవేశపెట్టారు. అయితే ఆత్యాధునిక 36 రాఫెల్స్‌ను రూ.59,000 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు భారత్‌, ఫ్రాన్స్‌ మధ్య 2016లో ఒప్పందం కుదిరింది.

ఇందులో భాగంగా తొలి బ్యాచ్‌గా ఐదు రాఫెల్‌ జెట్స్‌ భారత్‌కు చేరాయి. ఇంకా 31 యుద్ధ విమానాలు భారతదేశానికి రావాల్సి ఉన్నాయి. ఇప్పుడు రెండో విడతలో మరికొన్ని విమానాలు దేశానికి చేరనున్నాయి. ఇదిలాఉంటే 2023 నాటికి ఐఏఎఫ్‌లో మొత్తం 36 రాఫెల్స్‌ చేరుతాయని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తూర్పు లఢఖ్ సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అత్యధునిక యుద్ధ విమానాలు రాఫెల్స్‌ను కూడా రక్షణ కోసం సరిహద్దులోకి మోహరించారు. సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్‌ ఏమాత్రం వక్రబుద్ధి చూపించినా తగిన బుద్ధి చెప్పేందుకు, వారి ఆట కట్టించేందుకు భారత ఆర్మీ, భారత వాయుసేన ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాఫెల్స్‌ రెండో బ్యాచ్‌ భారత్‌కు చేరనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags :
|
|

Advertisement