Advertisement

  • ఈ ఐపీయల్ లో ఇక ఆ జట్టుకి కష్టమే ..స్కాట్ స్టయిరీస్

ఈ ఐపీయల్ లో ఇక ఆ జట్టుకి కష్టమే ..స్కాట్ స్టయిరీస్

By: Sankar Fri, 23 Oct 2020 4:59 PM

ఈ ఐపీయల్ లో ఇక ఆ జట్టుకి కష్టమే ..స్కాట్ స్టయిరీస్


ఐపీయల్ దిగ్గజ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఐపీయల్ లో లీగ్ దశలోనే వెనుదిరిగేలా ఉంది అన్నాడు కివీస్ మాజీ ఆటగాడు స్కాట్ స్టయిరీస్..పది మ్యాచ్‌లు ఆడి మూడింట్లోనే గెలిచిన సూపర్ కింగ్స్.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించే స్థితిలో ఉందని స్టైరీస్ తెలిపాడు. ‘‘గత మ్యాచ్ తర్వాత చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను బట్టి చెప్పొచ్చు. తమ జట్టు లైఫ్ సైకిల్ అయిపోందని ఫ్లేమింగ్ భావిస్తున్నాడు. ఇదే విషయం గురించి మూడేళ్లుగా మనం మాట్లాడుతున్నాం. చెన్నై జట్టులో చాలా మంది ఆటగాళ్లకు వయసు మీద పడుతోంది. వయసు పెరుగుతున్నప్పుడు.. ఒక దశలో ప్రదర్శన ఉన్నత స్థితి నుంచి పడిపోతుంది. బహుశా ఈ ఏడాది అది జరుగుతోంది’ అని స్టైరీస్ తెలిపాడు.

చెన్నై జట్టులో ధోనీ సహా చాలా మంది ఆటగాళ్లు 30 ఏళ్లు పైబడిన వారే. గత సీజన్లో ధోనీ సేన ఆకట్టుకునే ప్రదర్శన చేసినప్పటికీ.. ఈ సీజన్లో ఫ్లేఆఫ్స్ చేరడం కష్టమని స్టైరీస్ అభిప్రాయపడ్డాడు. ‘చెన్నైలో మ్యాచ్ విన్నర్ల వయసు మీద పడుతోంది. దీంతో ఫామ్‌లోకి రాలేకపోతున్నారు. డుప్లెసిస్ ఒక్కడే నిలకడగా రాణిస్తుండగా.. చాహర్ ఆకట్టుకుంటున్నాడు. మిగతా వాళ్ల ప్రదర్శన అంతగా బాగోలేదని స్టైరీస్ తెలిపాడు.

Tags :
|
|

Advertisement