Advertisement

  • కరోనా వైరస్ సోకిన కణాల ఫోటోలు విడుదల చేసిన శాస్త్రవేత్తలు

కరోనా వైరస్ సోకిన కణాల ఫోటోలు విడుదల చేసిన శాస్త్రవేత్తలు

By: Sankar Mon, 14 Sept 2020 4:24 PM

కరోనా వైరస్ సోకిన కణాల ఫోటోలు విడుదల చేసిన శాస్త్రవేత్తలు


కొవిడ్‌ వ్యాప్తి ప్రారం­భ­మై­న­ప్ప­టి­నుంచీ శాస్త్ర­వే­త్తలు దీని గుట్టు­వి­ప్పేం­దుకు విశ్వ­ప్ర­య­త్నాలు చేస్తూనే ఉన్నారు. ఓ పక్క కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం శ్రమి­స్తూనే... మరో­పక్క మన శ్వాస­కోశ కణా­ల్లోకి వైరస్‌ ఎలా చేరు­తుంది.. కణాల్లో వైరస్‌ ఆకృతి ఎలా ఉంటుంది? అనే­దా­నిపై పరి­శో­ధ­నలు సాగి­స్తూనే ఉన్నారు. అయితే, ఈ విష­యంలో తాజాగా నార్త్ కరో­లినా విశ్వ­వి­ద్యా­లయ సైంటి­స్టులు విజయం సాధిం­చారు. కరో­నా­వై­రస్‌ శ్వాస­కోశ కణాల్లో ఉన్న ఫొటో­లను వారు స్కానింగ్ ఎల­క్ట్రాన్ మైక్రో­స్కో­పీని ఉప­యో­గించి చిత్రీ­క­రిం­చ­గ­లి­గారు.

నార్త్ కరో­లినా విశ్వ­వి­ద్యా­లయం (యూఎ­న్‌సీ) చిల్డ్రన్ రీసెర్చ్ ఇన్‌­స్టి­ట్యూట్‌ నుంచి కెమిల్లె ఎహ్రేతో సహా పరి­శో­ధ­కులు ఈ చిత్రా­లను సంగ్ర­హిం­చారు. పరి­శో­ధ­నలో భాగంగా వీరు మని­షి­లోని ఊపి­రి­తి­త్తు­ల­లో­గల బ్రాంకి­యల్‌ ఎపి­థీ­లి­యల్ కణా­లలో కరో­నా­వై­రస్ (సార్స్‌ సీఓవీ -2)ను టీకాల ద్వారా పంపించారు. అనంతరం వారు 96 గంటల తరు­వాత అధిక శక్తితో కూడిన స్కానింగ్ ఎల­క్ట్రాన్ మైక్రో­స్కో­పీని ఉప­యో­గించి పరి­శీ­లిం­చారు.

అధిక శక్తి మాగ్ని­ఫి­కే­షన్ ఉప­యో­గించి వాటి ఫొటోలను చిత్రీకరించారు. ఒక్కో కణంలో ఎన్ని వైరస్‌లు ఉత్పత్తి అవుతున్నాయి.. అవి అక్కడి నుంచి ఎలా వెళ్తున్నాయో ఈ ఫొటోల ద్వారా తెలుసుకోగలిగారు. ఈ ఫొటోలను ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడి­సిన్’ ప్రచురించింది.

కరోనా సోకిన వారిలో వైరస్‌ శ్వాససంబంధిత వ్యవస్థ పైపొరపై అధిక మొత్తంలో ఉంటోందని ఫొటోల ఆధారంగా తెలిసింది. ఇది అక్కడినుంచి మిగతా అవయవాల్లోని కణాలపై దాడి చేస్తోంది. మానవ శరీరంలో కొన్ని కణాలు నిద్రాణమై లేక ఇన్‌యాక్టివ్‌గా ఉంటాయి. అలాంటి కణాలను కరోనా వైరస్‌ లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఫొటోల ఆధారంగా శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ ఫొటోలు మాస్కు ఆవశ్యకతను తెలియజేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా వచ్చినా.. రాకపోయినా మాస్కు వాడడం తప్పనిసరని అంటున్నారు. బయటకు వెళ్లినప్పుడు ప్రతిఒక్కరూ నాణ్యమైన మాస్కు పెట్టుకుంటే దీనిని అడ్డుకోవచ్చని సూచిస్తున్నారు.

Tags :
|

Advertisement