Advertisement

  • నేటి నుంచే 50 శాతం టీచర్ లతో స్కూల్స్ ప్రారంభం ..రూల్స్ ఇవే

నేటి నుంచే 50 శాతం టీచర్ లతో స్కూల్స్ ప్రారంభం ..రూల్స్ ఇవే

By: Sankar Mon, 21 Sept 2020 10:19 AM

నేటి నుంచే 50 శాతం టీచర్ లతో స్కూల్స్ ప్రారంభం ..రూల్స్ ఇవే


అన్‌లాక్‌ 4.0లో భాగంగా 9 నుంచి 12 తరగతుల వరకు క్లాసుల నిర్వహణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.

వాటి ప్రకారమే నడుచుకోవాలని స్పష్టంచేసింది. దీంతో దాదాపు 6 నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు తెరచుకోబోతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఇష్టమైతేనే బడికి వెళ్లే వెసులుబాటు కల్పించింది. అయితే, తల్లిదండ్రుల అనుమతితోనే స్కూలుకు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌ క్లాసులు వినే ఆప్షన్‌ ఇచ్చింది. ఇంటర్మీడియట్‌ కాలేజీల్లోనూ ఇదే విధానం పాటించనున్నారు.

ఆన్‌లైన్‌ తరగతుల్లో ఉపాధ్యాయులు అనుసరించాల్సిన విధానాలు.. బాధ్యతలు సహా ఇతర అంశాలపై విద్యాశాఖ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. అన్ని జిల్లాల్లో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి.. టీచర్లకు విధివిధానాలను వివరించారు. ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు విధులకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

కొన్ని చోట్ల వారంలో మూడు రోజుల చొప్పున హాజరయ్యేందుకు అధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. తెలంగాణలో ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమై 20 రోజులు అవుతున్నందున పాఠాల వారీగా వర్క్‌షీట్ల పంపిణీ, వాటి ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని టీచర్లను ఆదేశించారు.

Tags :
|
|

Advertisement