Advertisement

  • నవంబర్ 2వ తేదీ నుంచి ఏపీలో పాఠశాలలు పున:ప్రారంభం..!

నవంబర్ 2వ తేదీ నుంచి ఏపీలో పాఠశాలలు పున:ప్రారంభం..!

By: Anji Thu, 15 Oct 2020 6:37 PM

నవంబర్ 2వ తేదీ నుంచి ఏపీలో పాఠశాలలు పున:ప్రారంభం..!

ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలో నవంబర్ 2వ తేదీ నుంచి పాఠశాలలు పున:ప్రారంభిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా వెలువరించిన లాక్ డౌన్ 5.0 నిబంధనల మేరకు పాఠశాలలు పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభించే విషయంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

గుంటూరు, విజయనగరం జిల్లాల్లో పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు కరోనా సోకిన నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని స్కూళ్ళు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడిన మంత్రి సురేశ్.. పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. న్యాయవ్యవస్థపై ప్రభుత్వం పోరాడాల్సిన పరిస్థితి దాపురించిందని… అయితే రాజ్యాంగ వ్యవస్థలపై ప్రభుత్వానికి పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు.

న్యాయవ్యవస్థను తాము ప్రభావితం చేస్తున్నామని స్వయంగా ప్రతిపక్ష నేతలే చెబుతున్నారని, అది ఎవరో అందరికీ తెలుసునన్నారు. మరోవైపు రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయనేది కేవలం ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ మాత్రమేనన్నారు. గత ప్రభుత్వ హయాంలో తహసీల్దార్‌ వనజాక్షిపై దాడి చేస్తే సీఎంగా ఉన్న చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు చేశారన్న ఆరోపణలు వచ్చిన పోలీసులపై కూడా చర్యలు తీసుకున్నామన్నారు. తమ ప్రభుత్వంలో ఎవరు, ఎక్కడ, ఎవరిపై దాడులు చేసినా చట్టం పరిధిలో చర్యలు తీసుకుంటామని ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.

Tags :

Advertisement