Advertisement

  • ఫ్లాష్ న్యూస్ ..ఏపీలో సరి బేసి విధానంలో నవంబర్ 2 నుంచి స్కూల్స్ ప్రారంభం

ఫ్లాష్ న్యూస్ ..ఏపీలో సరి బేసి విధానంలో నవంబర్ 2 నుంచి స్కూల్స్ ప్రారంభం

By: Sankar Tue, 20 Oct 2020 5:42 PM

ఫ్లాష్ న్యూస్ ..ఏపీలో సరి బేసి విధానంలో నవంబర్ 2 నుంచి స్కూల్స్ ప్రారంభం


ఏపీలో నవంబర్‌ 2 నుంచి స్కూళ్లు పునః ప్రారంభం కానున్నాయి. అయితే రెండు రోజులకు ఓసారి తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. సరి బేసి విధానంలో క్లాసులు నిర్వహంచనున్నారు. అంటే 1,3,5,7 తరగతి విద్యార్థులకు ఒక రోజు.. 2,4,6,8 తరగతుల విద్యార్థుల మరో రోజు క్లాసులు నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం.

విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడ్రోజులకోసారి ఈ తరగతులు ఉంటాయి. నవంబర్‌లో ఒంటిపూట బడులు ఉంటాయని సీఎం జగన్ పేర్కోన్నారు.మధ్యాహ్న భోజన పథకం అమలవుతుందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకపోతే వారికి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. పరిస్థితిని బట్టి పాఠశాల వేళలపై డిసెంబర్‌లో నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ తెలిపారు.

ఇక ఇప్పటికే .."జగనన్న విద్యా కానుక" పధకం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ కిట్ లో భాగంగా.. 3 జతల యూనిఫాం, నోటు పుస్తకాలు, ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, మూడు జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్ ను విద్యార్ధులకు పంపిణీ చేయనున్నారు.

Tags :
|
|

Advertisement