Advertisement

ఆ రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి స్కూల్స్ రీ ఓపెన్

By: Sankar Sun, 08 Nov 2020 2:02 PM

ఆ రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి స్కూల్స్ రీ ఓపెన్


దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు. అయినప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు ఓపెన్ చేశారు.

ఏపీలో స్కూల్స్ తెరిచిన తరువాత విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా సోకడం ప్రారంభమైంది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, దేశంలో కరోనా ఉధృతి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు స్కూల్స్ ఓపెన్ చేయలేదు.

ఈనెల 23 వ తేదీ నుంచి స్కూల్స్ ఓపెన్ చేయబోతున్నారు. దీపావళి తరువాత నవంబర్ 17 నుంచి 22 వరకు రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికి కరోనా టెస్టులు నిర్వహించనున్నారు. కరోనా టెస్టుల అనంతరం నవంబర్ 23 వ తేదీన స్కూల్స్ ను ఓపెన్ చేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ప్రకటించారు.

Tags :
|

Advertisement