Advertisement

అక్కడ నేటి నుంచే స్కూల్స్ తిరిగి ప్రారంభం..

By: Sankar Tue, 01 Sept 2020 3:46 PM

అక్కడ నేటి నుంచే స్కూల్స్ తిరిగి ప్రారంభం..


ఇండియాలో కరోనా కారణంగా విద్యాసంస్థలు బందైనా సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30 వరకు విద్యాసంస్థలపై నిషేధం కొనసాగుతోంది. అయితే, కరోనా కారణంగా ఇంగ్లాండ్ లో విద్యాసంస్థలు నిన్నటి వరకు మూతపడ్డాయి. కాగా, ఈరోజు నుంచి ఇంగ్లాండ్ లో విద్యాసంస్థలు తిరిగి ఓపెన్ చేశారు. బ్రిటన్ లో విద్యాసంవత్సరం అధికారికంగా ప్రారంభం కాబోతున్నది.

అయితే, స్కూల్స్ లో పిల్లలు, టీచర్స్, సిబ్బంది మధ్య డైరెక్ట్ కాంటాక్ట్ కాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించేలా చూస్తున్నారు. ఫేస్ మాస్క్ తప్పనిసరి చేశారు. స్కూల్స్, కాలేజీలు తిరిగి తెరుచుకోవడంతో లక్షలాది మంది విద్యార్థులు స్కూల్స్ కు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.

కాగా స్కూల్స్ ప్రారంభం అవుతున్న తరుణంలో కీలక ఆదేశాలు జారీ చేసింది..తుమ్ము , దగ్గు రాకుండా తుమ్మినా , దగ్గినా , కరోనా గురించి జోకులు వేసుకుంటూ మాట్లాడుకున్న విద్యార్థుల మీద చర్యలు తీసుకుంటాము అని అవసరం అయితే స్కూల్ నుంచి పంపిస్తాము అని తెలిపారు

Tags :
|

Advertisement