Advertisement

  • స్కూల్స్‌ ఓపెనింగ్ గురించి తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకోవాలి; హెచ్‌ఆర్‌డీ

స్కూల్స్‌ ఓపెనింగ్ గురించి తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకోవాలి; హెచ్‌ఆర్‌డీ

By: chandrasekar Tue, 21 July 2020 4:46 PM

స్కూల్స్‌ ఓపెనింగ్ గురించి  తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకోవాలి; హెచ్‌ఆర్‌డీ


రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు అనువైన సమయం ఏమిటో తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకోవాలని కోరింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యూకేషన్‌ అండ్‌ లిటరసీ, మానవ వనరుల మంత్రిత్వశాఖ సర్క్యులర్‌ పంపింది.

ఇందులో సోమవారంలోగా తల్లిదండ్రుల ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వాలని సూచించింది. ఈ సందర్భంగా మూడు అంశాలపై అభిప్రాయాలు తెలుసుకోవాలని కోరింది. పాఠశాలలు తిరిగి తెరిచేందుకు ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో ఏ సమయం సౌకర్యంగా ఉంటుందో తెలుసుకోవాలని పాఠశాలల నుంచి తల్లిదండ్రుల అంచనాలు, ఇంకా ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే తీసుకోవాలని పేర్కొంది. కరోనా వైరస్‌ సంక్రమణ క్రమంలో దాన్ని కట్టడి చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా మార్చిలో లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి.

అనంతరం పలు సడలింపులు ఇచ్చినా విద్యాసంస్థలు ప్రారంభానికి నోచుకోలేదు. కరోనా సంక్షోభం కారణంగా దేశంలో ‘అసాధారణ పరిస్థితి’ కారణంగా ప్రభుత్వం జూలై మొదటి వారంలో 9నుంచి 12 తరగతుల విద్యార్థులకు 30శాతం వరకు సిలబస్‌ను కుదించాలని నిర్ణయించింది.

కోల్పోయిన సిలబస్‌ను భర్తీ చేసేందుకు తరగతి గది బోధనకు బదులుగా ఆన్‌లైన్‌ క్లాస్‌లను హె‌చ్‌ఆర్‌డీ ప్రోత్సహిస్తున్నది. ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై తల్లిదండ్రులు లేవనెత్తిన ఆందోళనల మేరకు మార్గదర్శకాలను మంత్రిత్వశాఖ విడుదల చేసింది. ఒకటి నుంచి 8వ తరగతి వరకు రోజులో 30-45 నిమిషాల చొప్పున రెండు సెషన్లకు మించకూడదని, 9 నుంచి 12 తరగతులకు సంబంధించిన రోజులో 30-45 నిమిషాల చొప్పున నాలుగు సెషన్లు మించకూడదని సూచించింది.

Tags :
|

Advertisement