Advertisement

  • పదో తరగతి పాసైన విద్యార్థినులకు స్కాలర్‌షిప్

పదో తరగతి పాసైన విద్యార్థినులకు స్కాలర్‌షిప్

By: chandrasekar Fri, 27 Nov 2020 10:22 PM

పదో తరగతి పాసైన విద్యార్థినులకు స్కాలర్‌షిప్


విద్యార్థినులకు స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతి పాసయ్యారా ఇలా చేస్తే ప్రతి నెలా చేతికి డబ్బులు వస్తాయి. సీబీఎస్ఈలో టెన్త్ క్లాస్ చదివిన విద్యార్థినులు 11వ తరగతి, 12వ తరగతి చదువుతున్న విద్యార్థినులు సీబీఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ 2020 కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పదో తరగతి పాసయ్యారా. అందులోనూ మీరు సింగిల్ గర్ల్ చైల్డ్‌గా ఉన్నారా. అయితే ఇలాంటి వారి కోసమే ప్రభుత్వం ప్రత్యేకమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) స్కాలర్‌షిప్ అందిస్తోంది. ఈ స్కీమ్ పేరు సీబీఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్. అమ్మాయిలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ సదుపాయాన్ని కల్పించింది. ఇందులో దరఖాస్తు చేసుకుంటే పదో తరగతి పాస్ అయిన అమ్మాయిలకు ప్రతినెలా కొంత నగదు స్కాలర్‌షిప్ అందనుంది.

పదో తరగతి పాసైన విద్యార్థినులకు సీబీఎస్ఈ అందిస్తున్న స్కాలర్‌షిప్‌లో భాగంగా రూ.500 మేర ప్రతినెలా చేతికి వస్తాయి. అయితే కేంద్ర ప్రభుత్వ విద్యా విధానం సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలలో టెన్త్ క్లాస్ చదివి ఉత్తీర్ణత సాధించిన బాలికలు ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అదే సమయంలో పాత విద్యార్థులు తమ స్కాలర్‌షిప్ రెన్యూవల్ చేసుకోవచ్చు. సీబీఎస్ఈలో చదివి పదో తరగతి పరీక్షల్లో60 శాతానికి పైగా మార్కులతో ఉత్తీర్ణత సాధించిన సింగిల్ గర్ల్ చైల్డ్‌ను అర్హులుగా భావిస్తారు. అదే విధంగా 11వ తరగతి, 12వ తరగతులను సైతం సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో చదువుకుంటున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 28వరకు ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యార్థినులకు మేలు కలగనుంది.

Tags :
|
|

Advertisement