Advertisement

  • కరోనా నేపథ్యంలో ఎస్‌బీఐ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ...ఎస్‌బీఐ చైర్మ‌న్ ర‌జ‌నీశ్ కుమార్

కరోనా నేపథ్యంలో ఎస్‌బీఐ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ...ఎస్‌బీఐ చైర్మ‌న్ ర‌జ‌నీశ్ కుమార్

By: Sankar Tue, 14 July 2020 7:07 PM

కరోనా నేపథ్యంలో ఎస్‌బీఐ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ...ఎస్‌బీఐ చైర్మ‌న్ ర‌జ‌నీశ్ కుమార్



క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ సంస్క‌ర‌ణ‌కు శ్రీకారం చుట్టింది. ఎక్క‌డ‌నుంచి అయిన ఉద్యోగులు ప‌నిచేసే విధంగా మౌళిక‌స‌దుపాయాల‌ను అభివృద్ధి ప‌ర‌చ‌నున్న‌ది. వ‌ర్క్ ఫ్ర‌మ్ ఎనీవేర్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌ను డెవ‌ల‌ప్ చేయ‌డం వ‌ల్ల వెయ్యి కోట్లు ఆదాకానున్న‌ట్లు ఎస్‌బీఐ చైర్మ‌న్ ర‌జ‌నీశ్ కుమార్ తెలిపారు.

65వ వార్షిక స‌మావేశంలో ఆయ‌న షేర్‌హోల్డ‌ర్ల‌తో మాట్లాడుతూ ఖ‌ర్చును త‌గ్గించ‌డం, రేష‌న‌లైజేష‌న్ విధానం, వ‌ర్క్‌ఫోర్స్‌కు నైపుణ్యాన్ని అందించే అంశాల‌పై దృష్టి పెట్టిన‌ట్లు ఆయ‌న చెప్పారు. సిబ్బంది నుంచి ఉత్ప‌త్తిని పెంచ‌డం, అడ్మిన్ ఆఫీసుల నుంచి సేల్స్ రోల్స్ వ‌ర‌కు ఉద్యోగుల‌ను విస్త‌రించే అంశాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా అమ‌లు అవుతున్న ఉత్త‌మ ప‌ద్ధ‌తుల‌ను ప‌రిశీలించి, బ్యాంకులో వ‌ర్క్ ఫ్ర‌మ్ ఎనీవేర్ స‌దుపాయాల‌ను క‌ల్పించ‌నున్న‌ట్లు ర‌జ‌నీశ్ తెలిపారు. 2021 ఆర్థిక సంవ‌త్స‌రం బ్యాంకుకు ఒక స‌వాల్‌గా మార‌నున్న‌ద‌ని, ఆ స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

Tags :
|
|
|
|
|

Advertisement