Advertisement

  • కొత్తగా కారు కొనాలనుకునేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా

కొత్తగా కారు కొనాలనుకునేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా

By: Sankar Wed, 02 Sept 2020 4:14 PM

కొత్తగా కారు కొనాలనుకునేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా


కొత్తగా కారు కొనాలనుకునేవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శుభవార్త అందించింది. ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకునేవారికి ఇది మాత్రం ఖచ్చితంగా గుడ్ న్యూసే... ఎస్బీఐ తన కస్టమర్లకు అదిరిపోయే లోన్ ఆఫర్ అందిస్తున్నది. ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలుకు అతితక్కువ వడ్డీకే రుణ సౌకర్యాన్ని కల్పిస్తున్నది.

స్టేట్ బ్యాంక్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేసే వారి కోసం" గ్రీన్ కార్ లోన్ స్కీమ్"‌ను అందుబాటులో ఉంచింది. ఎలక్ట్రిక్ వెహికల్ అమ్మకాలు పెంచాలనే లక్ష్యంతో బ్యాంక్ ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ పథకం కింద ఎలక్ట్రిక్ కారు కొనుగోలుకు లోన్ తీసుకుంటే తీసుకున్న రుణాన్ని 8 ఏండ్ల లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

ఇతర కార్ లోన్లతో పోలిస్తే గ్రీన్ కార్ లోన్ స్కీమ్‌పై లోన్ తీసుకుంటే 0.2 శాతం వడ్డీ తగ్గుతుంది. కారు ఆన్‌రోడ్ ధరలో 90 శాతం వరకు మొత్తాన్ని రుణం కింద పొందొచ్చు. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఎక్సెండ్ వారంటీ, సర్వీస్ ప్యాకేజీ, మెయింటెన్స్, యాక్ససిరీస్ వంటి వాటికి అయ్యే ఖర్చులను కారు ధరలో కలుపుకుంటే ఆన్‌రోడ్ ధర వస్తుంది.

ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు ఈ కారు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. వార్షిక ఆదాయం కనీసం రూ.3 లక్షలు ఉండాలి. లోన్ కోసం అప్లై చేసుకోవాలని భావిస్తే ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, శాలరీ స్లిప్, ఫామ్ 16 వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి

Tags :
|
|
|
|
|

Advertisement