Advertisement

  • ధోని నమ్మకాన్ని కోల్పోతే ఇక అంతే ...సీఎస్కె మాజీ ఆటగాడు బద్రీనాథ్

ధోని నమ్మకాన్ని కోల్పోతే ఇక అంతే ...సీఎస్కె మాజీ ఆటగాడు బద్రీనాథ్

By: Sankar Sun, 12 July 2020 1:32 PM

ధోని నమ్మకాన్ని కోల్పోతే ఇక అంతే ...సీఎస్కె మాజీ ఆటగాడు బద్రీనాథ్



మహేంద్ర సింగ్ ధోని ..అటు ఇండియన్ టీం లో గాని , ఇటు ఐపీయల్ లోగాని అత్యుత్తమ కెప్టెన్ లలో మొదటి స్థానంలో ఉంటాడు ..ధోని ఇంతలా విజయవంతం అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి ..అయితే అందులో ముఖ్యమైంది ఆటగాళ్లను ఎక్కువగా మార్చకపోవడం..ఉన్న ఆటగాళ్లలోనే ఆత్మ విశ్వాసాన్ని నింపి వారి నుంచి ఫలితాలను రాబట్టడంలో ధోని దిట్ట ..అందుకే ధోని కెప్టెన్ గా చేసిన అన్నిరోజులు టీం లో ఎక్కువగా మార్పులు ఉండకపోయేవి ..

అయితే ధోని ఐపీయల్ టీంలో సహచర ఆటగాడు అయినా బద్రీనాథ్ ధోని కెప్టెన్సీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు ..మహేంద్రసింగ్ ధోనీ నమ్మకాన్ని ప్లేయర్ ఒకసారి పొగొట్టుకుంటే అతనికి ఆ దేవుడు కూడా సాయం చేయలేడని అన్నాడు ఈ మాజీ ఆటగాడు ..చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో కొన్ని సీజన్లు ఆడిన బద్రీనాథ్.. ఆ తర్వాత కనుమరుగైపోయాడు. అప్పట్లో తనకి మిడిలార్డర్‌లో కీలక బాధ్యతల్ని ధోనీ అప్పగించాడని గుర్తు చేసుకున్న బద్రీనాథ్.. ప్రతిభ ఉన్న ఆటగాళ్లకి కెప్టెన్‌గా అతని సపోర్ట్ ఫుల్‌గా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

బద్రీనాథ్ మాట్లాడుతూ జట్టులోని ప్రతి ఆటగాడిగా ధోనీ కచ్చితమైన బాధ్యతలు అప్పగిస్తాడు. చాలా వరకూ నా బాధ్యత మిడిలార్డర్‌లో స్కోరు బోర్డుని నడిపించడంగా ఉండేది. ధోనీ ఆటగాళ్లకి ఎక్స్‌ట్రా ఛాన్స్‌లు కూడా ఇస్తుంటాడు. ధోనీ నమ్మాడంటే మంచిది.. ఆటగాడు జట్టులో ఉంటాడు. ఒకవేళ అతని నమ్మకాన్ని ప్లేయర్ కోల్పోతే..? ఇక అంతే దేవుడు కూడా సాయం చేయలేడు. ధోనీ ఒక మైండ్ సెట్‌తో ఉంటాడు.. దానికే అతను కట్టుబడతాడు’’ అని వెల్లడించాడు..

Tags :
|
|

Advertisement