Advertisement

  • స్మార్ట్‌ వాటర్‌ మీటర్లు ద్వారా నీటి వినియోగం ఆదా

స్మార్ట్‌ వాటర్‌ మీటర్లు ద్వారా నీటి వినియోగం ఆదా

By: chandrasekar Mon, 08 June 2020 10:39 AM

స్మార్ట్‌ వాటర్‌ మీటర్లు ద్వారా నీటి వినియోగం ఆదా

నగరాల్లో నీటి ఇబ్బందులు తొలగిపోవాలంటే ప్రస్తుతం లభిస్తున్న మంచినీటిని సమర్థంగా వినియోగించుకోవాలి. అప్పుడే, భవిష్యత్తు తరాలకు మేలు చేసినవారం అవుతాం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, నీటి సమస్యను పరిష్కరించడానికి ఆధునిక పరిజ్ఞానం తోడ్పడుతున్నది. దాదాపు 35 శాతం దాకా నీటి వినియోగాన్ని ఆదా చేసే స్మార్ట్‌ వాటర్‌ మీటర్లు మార్కెట్లోకి రంగ ప్రవేశం చేశాయి. వీటిని నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లు, భారీ గేటెడ్‌ కమ్యూనిటీలు, ఆకాశహర్మ్యాల్లో బిగిస్తే సత్ఫలితాలు లభిస్తాయి.

ఇలాంటి వాస్తవిక సమస్యలకు పక్కా పరిష్కారం చూపెడతాయి స్మార్ట్‌ వాటర్‌ మీటర్లు. ప్రతి కుటుంబం వాడుకున్నంత మేరకే నీటి బిల్లులను పంపించడంలో ఇవి తోడ్పడతాయి. నీటి సరఫరాలో హెచ్చుతగ్గులున్నా సవరించవచ్చు. మొత్తానికి, ముప్పయ్‌ ఐదు శాతం దాకా మంచినీటిని ఆదా చేసుకోవచ్చు. ఈ క్రమంలో ‘వాటర్‌ ఆన్‌' ఆధునిక మీటర్ మంచినీటిని కొలవడంతోపాటు పర్యవేక్షిస్తుంది. నీటి వినియోగాన్ని కూడా నియంత్రిస్తుంది. పైగా, కొంత ఖర్చు పెట్టి వీటిని ఫ్లాట్‌లో బిగిస్తే ప్రతిఇంటికి నెలనెలా మంచినీటి బిల్లులను ఆయా సంస్థలే ఇంటి యజమానులకు పంపిస్తాయి.

Tags :
|
|

Advertisement