Advertisement

  • భారత సరిహద్దుల విషయంలో చేసిన తప్పును సరిచేసుకున్న సౌదీ అరేబియా

భారత సరిహద్దుల విషయంలో చేసిన తప్పును సరిచేసుకున్న సౌదీ అరేబియా

By: Sankar Fri, 20 Nov 2020 4:12 PM

భారత సరిహద్దుల విషయంలో చేసిన తప్పును సరిచేసుకున్న సౌదీ అరేబియా


జీ 20 దేశాల శిఖరాగ్ర సదస్సు ఈ సారి సౌదీ అరేబియా వేదిక కానుంది. సౌది యువరాజు మహ్మద్‌ బీన్‌ సల్మాన్‌ అధ్యక్షతన ఈ సమావేశం డిసెంబర్‌ 21,22 తేదీల్లో జరుగనుంది. అయితే దీని కోసం సౌదీ అరేబియా ప్రత్యేకంగా రూపొందించిన 20 రియాల్‌ నోట్‌పై భారత ప్రాదేశిక సరిహద్దులను తప్పుగా చిత్రీకరించడం వివాదానికి దారీ తీసింది.

సౌదీ తీరుపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్మూకశ్మీర్‌, లద్ధాఖ్ ప్రాంతాలను భారత్‌లో అంతర్భాగంగా చూపించకపోవడం భారత ఆగ్రహానికి కారణమైంది. ఈ విషయంపై సౌదీ రాయబారి అషఫ్‌ సయీద్‌కు తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ అక్టోబర్‌ 28న కోరగా.. సమస్య పరిష్కారానికి సౌదీ చొరవ చూపింది.

దీనిపై స్పందించిన సౌదీ.. ఈ చిహ్నం కేవలం నమూనా మాత్రమే దీన్ని దేశంలో చేలామనిలో ఉండదని వివరించింది. ఈ మ్యాప్‌లో గిల్గిత్‌-బల్టిస్తాన్‌ పీఓకేను పూర్తిగా ప్రత్యేక భూభాగంగా చూపించడం గమనార్హం.

Tags :

Advertisement