Advertisement

  • కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సౌదీ అరేబియా ప్రిన్స్ మొహ‌మ్మ‌ద్ బిన్ స‌ల్మాన్

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సౌదీ అరేబియా ప్రిన్స్ మొహ‌మ్మ‌ద్ బిన్ స‌ల్మాన్

By: Sankar Sat, 26 Dec 2020 4:14 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సౌదీ అరేబియా ప్రిన్స్ మొహ‌మ్మ‌ద్ బిన్ స‌ల్మాన్


ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది...అయితే కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కూడా వచ్చింది ..ఇప్పటికే బ్రిటన్ లో అనేకమంది ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు...అమెరికాలో కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణి జరుగుతుంది ..తాజాగా సౌదీ అరేబియా ప్రిన్స్ మొహ‌మ్మ‌ద్ బిన్ స‌ల్మాన్ కోవిడ్‌19 టీకా తీసుకున్నారు.

శుక్ర‌వారం ఆయ‌న టీకా తీసుకున్న‌ట్లు ఆ దేశ మీడియా వెల్ల‌డించింది. కోవిడ్ టీకా తీసుకున్న ప్ర‌పంచాధినేత‌ల్లో ఒక‌రిగా ఆయ‌న నిలిచారు. ఇటీవ‌లే ఇజ్రాయిల్ ప్ర‌ధాని బెంజిమ‌న్ నెతాన్యూ కూడా లైవ్‌లో టీకా తీసుకున్నారు. అమెరికా అధ్య‌క్షుడిగా కొత్త‌గా ఎన్నికైన జో బైడెన్ కూడా క‌రోనా టీకా తీసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌జ‌ల‌కు టీకాను పంపిణీ చేయాల‌ని ప్రిన్స్ స‌ల్మాన్ ఎంతో ఆస‌క్తిగా ఉన్నార‌ని, ఆ అంశాన్ని ఆయ‌న ఎప్పుడూ ఫాలో చేశార‌ని ఆ దేశ ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ తౌఫీక్ అల్ ర‌బియా పేర్కొన్నారు.

2023 విజ‌న్‌లో భాగంగా.. ప్ర‌జ‌ల ఆరోగ్యానికి పెద్ద పీట వేశామ‌ని, అతి త‌క్కువ స‌మ‌యంలోనే సుర‌క్షిత‌మైన‌, అంత‌ర్జాతీయ స్థాయి క‌లిగిన టీకాను ఇవ్వనున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

Tags :
|
|
|

Advertisement