Advertisement

  • ప్రభుత్వ హాస్పిటల్ కు రూ.15 లక్షల విలువైన పరికరాలు ఉచితంగా అందించిన సర్పంచ్

ప్రభుత్వ హాస్పిటల్ కు రూ.15 లక్షల విలువైన పరికరాలు ఉచితంగా అందించిన సర్పంచ్

By: chandrasekar Thu, 26 Nov 2020 11:24 AM

ప్రభుత్వ హాస్పిటల్ కు రూ.15 లక్షల విలువైన పరికరాలు ఉచితంగా అందించిన సర్పంచ్


తెలంగాణలోని ప్రభుత్వ హాస్పిటల్ కు రూ.15 లక్షల విలువైన పరికరాలను ఒక సర్పంచ్ ఉచితంగా అందించారు. నిరుపేదలకు సేవలందించాలనే ఉద్దేశంతో జిల్లాలోని మరిపెడ మండలం బురహాన్‌పురం సర్పంచ్‌ మచ్చ శ్రీనివాసరావు ప్రభుత్వ హాస్పిటల్ కు రూ.15 లక్షల విలువైన పరికరాలు గిఫ్ట్‌గా అందించాడు.

అయన బుధవారం జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్‌కు అందించిన రూ. 10.63 లక్షల విలువైన ఆధునిక ఎక్స్‌రే మిషన్‌, రూ. 4.37 లక్షల విలువైన బ్లడ్‌గ్యాస్‌ ఎనలైజర్‌ను కలెక్టర్‌ వీపీ గౌతంతో కలిసి సర్పంచ్‌ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హై ఇంటెన్సిటీతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఎక్స్‌రేను శ్రీనివాసరావు కొనుగోలు చేసి నిరుపేదలకు అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు.

సర్పంచును స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకు వచ్చి హాస్పిటల్‌ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ సందర్భంగా మచ్చ శ్రీనివాసరావును కలెక్టర్‌, హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌, కో ఆర్డినేటర్‌ భీమ్‌సాగర్‌ సన్మానించారు. కార్యక్రమంలో వైద్యులు రమేశ్‌, సూర్యకుమారి, సతీశ్‌, వెంకన్న, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Advertisement