Advertisement

  • ధోనీ లేదా గిల్‌క్రిస్ట్ ..ఈ ఇద్దరిలో అతడికే నా ఓటు ..సర్ఫరాజ్ అహ్మద్

ధోనీ లేదా గిల్‌క్రిస్ట్ ..ఈ ఇద్దరిలో అతడికే నా ఓటు ..సర్ఫరాజ్ అహ్మద్

By: Sankar Fri, 19 June 2020 12:18 PM

ధోనీ లేదా గిల్‌క్రిస్ట్ ..ఈ ఇద్దరిలో అతడికే నా ఓటు ..సర్ఫరాజ్ అహ్మద్



ప్రపంచ క్రికెట్లో కీపర్ అంటే కేవలం కీపింగ్ కోసం మాత్రమే అనే రోజుల్లో ఆస్ట్రేలియా స్టార్ వికెట్ కీపర్ గిల్క్రిస్ట్ వచ్చి కీపర్ అనే పదానికి సరికొత్త అర్ధాన్ని ఇచ్చాడు..తన హార్డ్ హిట్టింగ్తో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపాడు ..ఆ తర్వాత కీపర్ స్థాయిని మరికొన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లిన ఆటగాడు ఇండియన్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని , కెప్టెన్ గా , ఫినిషర్ గా , హిట్టర్ గా ఇలా అనేక పాత్రలతో ప్రతి టీం కూడా ఇలాంటి కీపర్ ఒక్కడు కావాలి అనుకునేలా తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.. అయితే ఈ ఇద్దరు కీపేర్లలో బెస్ట్ ఎవరు అంటే చెప్పడం కొంచెం కష్టమే ..కానీ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మాత్రం ఏ మాత్రం తడుముకోకుండా ధోనీకే వోట్ వేసాడు..

పాకిస్థాన్ జట్టుకి గత ఏడాది చివరి నుంచి దూరంగా ఉంటున్న సర్ఫరాజ్ అహ్మద్ తాజాగా ఓ లైవ్ సెషన్‌లో మాట్లాడుతుండగా.. అతనికి ‘ధోనీ లేదా గిల్‌క్రిస్ట్.. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్..?’ అనే ప్రశ్న ఎదురైంది. దాంతో.. క్షణం కూడా ఆలోచించని సర్ఫరాజ్.. ‘ధోనీ’ అని సమాధానం చెప్పేశాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి సర్ఫరాజ్ అరంగేట్రం చేయగా.. 2008లో గిల్‌క్రిస్ట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో.. గిల్‌క్రిస్ట్‌ బ్యాటింగ్, కీపింగ్ ప్రదర్శనల్ని టీవీల్లో మాత్రమే సర్ఫరాజ్ చూసి ఉండొచ్చు. కానీ.. ధోనీ ఆట అతనికి సుపరిచితం. ఈ ఇద్దరూ ప్రత్యర్థులుగా చాలా మ్యాచ్‌ల్లో ఢీకొన్నారు.

కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌‌గా గత ఏడాది చివర్లో సర్ఫరాజ్ అహ్మద్ ఘోరంగా విఫలమయ్యాడు. దాంతో.. అతడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. వన్డే/ టీ20 పగ్గాలు బాబర్ అజామ్ చేతికి, టెస్టు టీమ్ కెప్టెన్సీని అజహర్ అలీకి అప్పగించింది. ఇక ఇంగ్లాండ్ టూర్‌కి త్వరలోనే పాకిస్థాన్ జట్టు వెళ్లనుండగా.. ఆ పర్యటన కోసం సర్ఫరాజ్ అహ్మద్‌ని కూడా ఎంపిక చేశారు.

Tags :
|
|
|

Advertisement