Advertisement

  • నన్ను నేను నమ్ముతాను ..అదే నా సక్సెస్ సీక్రెట్..సంజు శాంసన్

నన్ను నేను నమ్ముతాను ..అదే నా సక్సెస్ సీక్రెట్..సంజు శాంసన్

By: Sankar Mon, 26 Oct 2020 4:18 PM

నన్ను నేను నమ్ముతాను ..అదే నా సక్సెస్ సీక్రెట్..సంజు శాంసన్


ప్రస్తుత ఇండియన్ క్రికెట్ లో యువ ఆటగాళ్లలో ఎంతో ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న ఆటగాడు సంజు శాంసన్ ..ఎటువంటి ఎఫర్ట్ లేకుండా అతి సునాయాసంగా శాంసన్ సిక్సర్లు బాడుతుంటే అందరు మైమరిచిపోతున్నారు...అయితే ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ నిలకడ లేకపోవడం అతనికి ప్రధాన సమస్యగా మారింది ..ఈ ఐపీయల్ లో కూడా తొలి రెండు మ్యాచ్ లలో సిక్సర్లతో చెలరేగిన శాంసన్ ఆతర్వాత వరుసగా విఫలంమయాడు..అయితే నిన్న ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం మల్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు..

అయితే నిన్నటి మ్యాచ్ లో విజయం తర్వాత శాంసన్ మాట్లాడుతూ నన్ను నేను నమ్ముతాను. నిజానికి 14 మ్యాచ్‌లు ఆడినప్పుడు కొన్ని ఎత్తుపళ్లాలు చవిచూడకతప్పదు. పెద్ద మైదానాల్లో, విభిన్న రకాల వికెట్ల మీద ఆడేటప్పుడు షాట్‌ సెలక్షన్‌ కోసం కాస్త ఎక్కువ సమయమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ గేమ్‌ప్లాన్‌ను నేను పక్కాగా అమలు చేశాను. అదే ఈనాటి మ్యాచ్‌లో నన్ను కొత్తగా నిలబెట్టింది.

ఎన్ని పరుగులు చేస్తున్నాం.. స్ట్రైక్‌రేట్‌ ఎంత ఉంది అన్న విషయాలపై నేను దృష్టిపెట్టలేదు. ప్రతీ బాల్‌ను ఎలా ఎదుర్కోవాలన్న అంశం మీద ఫోకస్‌ చేశాను. అవకాశం వచ్చిన ప్రతిసారి బంతిని బలంగా హిట్‌ చేశాను. అలా కుదరని సమయాల్లో సింగిల్స్‌, డబుల్స్‌ తీయడానికి ప్రాధాన్యం ఇచ్చాను’’ అంటూ రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు సంజూ శాంసన్‌ తన ఆటతీరు పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు వెల్లడించాడు. సింపుల్‌ గేమ్‌ప్లాన్‌ను అమలు చేసి లక్ష్యాన్ని పూర్తిచేసినట్లు పేర్కొన్నాడు

Tags :
|

Advertisement