Advertisement

  • ఆ రోజు ధోని నమ్మకం ఉంచడం వల్లనే కోహ్లీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు ..సంజయ్ మంజ్రేకర్

ఆ రోజు ధోని నమ్మకం ఉంచడం వల్లనే కోహ్లీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు ..సంజయ్ మంజ్రేకర్

By: Sankar Tue, 15 Dec 2020 10:18 PM

ఆ రోజు ధోని నమ్మకం ఉంచడం వల్లనే కోహ్లీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు ..సంజయ్ మంజ్రేకర్


టీంఇండియాలో మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ..కేవలం ఆటగాడిగానే గాక ఒక లీడర్ గా కూడా టీం ఇండియా ఎన్నో విజయాలను అందించడమే కాకుండా యువ ఆటగాళ్ల మీద నమ్మకం ఉంచి వాళ్ళు సూపర్ స్టార్ ఆటగాళ్లు అయ్యేలా చేసాడు..అందుకు బెస్ట్ ఉదాహరణ రోహిత్ శర్మ ...మిడిల్ ఆర్డర్లో సరిగా ఆడలేక జట్టులో స్థానం కోల్పోయే దశలో ఉన్న రోహిత్ ను ఓపెనర్ ను చేసాడు..ఇక అక్కడినుంచి రోహిత్ ఏ స్థాయిలో చెలరేగాడో అందరికి తెలిసిందే...

ఇక అలాగే 2011-12 ఆస్ట్రేలియా పర్యటనలో యువ విరాట్‌ కోహ్లీ జట్టు నుంచి ఉద్వాసనకు గురి కాకుండా అప్పటి భారత కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ కాపాడిన విషయాన్ని కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ గుర్తు చేశాడు. తొలి రెండు టెస్టుల్లో 11, 0, 23, 9 పరుగులు మాత్రమే చేసి విఫలమైనా కోహ్లీకి ధోనీ మద్దతుగా నిలిచాడని అన్నాడు. తదుపరి మ్యాచ్‌లకు కోహ్లీని తప్పించాలని మేనేజ్‌మెంట్‌ ఆలోచించినా.. మహీ మాత్రం విరాట్‌పైనే నమ్మకముంచాడని ఓ టీవీషోలో మంజ్రేకర్‌ చెప్పాడు.

విఫలమైనా జట్టులో కొనసాగించడంతో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన విరాట్‌ పెర్త్‌లో జరిగిన మూడో టెస్టులో 44, 75 పరుగులతో రాణించాడు. తర్వాతి ఆడిలైడ్‌ టెస్టులో శతకంతో కదం తొక్కి.. సిరీస్‌లో సెంచరీ చేసిన ఏకైక భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. టీమ్‌ఇండియా ఆ సిరీస్‌ను 0-4తో ఆసీస్‌ చేతిలో కోల్పోయినా.. భారత క్రికెట్‌కు అద్భుతమైన క్రికెటర్‌ దొరికాడని ప్రపంచానికి తెలిసింది అని అన్నాడు ..

Tags :
|
|
|

Advertisement