Advertisement

  • జడేజా ఆడిన ఇన్నింగ్స్ పై ప్రశంసలు కురిపించిన సంజయ్ మంజ్రేకర్

జడేజా ఆడిన ఇన్నింగ్స్ పై ప్రశంసలు కురిపించిన సంజయ్ మంజ్రేకర్

By: Sankar Thu, 03 Dec 2020 11:44 AM

జడేజా ఆడిన ఇన్నింగ్స్ పై ప్రశంసలు కురిపించిన సంజయ్ మంజ్రేకర్


భారత మాజీ ఆటగాడు ,కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ భారత స్టార్ అల్ రౌండర్ జడేజా మీద ప్రశంసలు కురిపించాడు...ప్రతిసారి జడేజా మీద విమర్శలు చేసే మంజ్రేకర్ , నిన్న జడేజా ఆడిన ఇన్నింగ్స్ తర్వాత ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోయాడు..

చివరి మూడు-నాలుగు ఓవర్లు జడేజా ఆడిన తీరు అమోఘం. జడేజా ఆడిన తీరును ప్రశంసించకుండా ఉండలేకపోతున్నా. ఆఫ్‌ సైడ్‌, లెగ్‌ సైడ్‌ షాట్లతో జడేజా అలరించాడు. జడేజా బ్యాటింగ్‌ పెర్ఫార్మాన్స్‌కు హ్యాట్సాఫ్‌. ఒక అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడాడు జడేజా. బంతితో కూడా జడేజా ఆకట్టుకున్నా ఇంకా ఎక్కువ తీయాలని కోరుకుంటున్నా. వన్డేల్లో జడేజా మరిన్ని వికెట్లను తీయాలి. గతేడాది కాలంగా జడేజా ప్రదర్శన మెరగవుతూ వస్తోంది.

చాలా నిలకడగా ఆడుతున్నాడు. బ్యాటింగ్‌లో సత్తాచాటుతున్నాడు. కానీ బౌలింగ్‌లో ఇంకా మెరుగు కావాలి. భారత్‌కు ఇంకా ఎక్కువ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిపెట్టాలి’ అని మంజ్రేకర్‌ ప్రశంసిచాడు. ఆసీస్‌తో చివరి వన్డేలో రాణించిన మరో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను కూడా మంజ‍్రేకర్‌ కొనియాడాడు. ‘పాండ్యా విపరీతమైన ఒత్తిడి గురయ్యాడని అనుకుంటున్నా. దాన్ని అధిగమిస్తూనే అతని అత్యుత్తమ వన్డే ఇన్నింగ్స్‌ను ఆడాడు. పాండ్యా బ్యాటింగ్‌ కారణంగానే టీమిండియా పోటీలో నిలిచింది’ అని మంజ్రేకర్‌ పేర్కొన్నాడు.

Tags :
|

Advertisement