Advertisement

  • క్యాన్సర్‌ నుండి బయటపడినట్లు ప్రకటించిన సంజయ్‌దత్‌

క్యాన్సర్‌ నుండి బయటపడినట్లు ప్రకటించిన సంజయ్‌దత్‌

By: chandrasekar Thu, 22 Oct 2020 09:23 AM

క్యాన్సర్‌ నుండి బయటపడినట్లు ప్రకటించిన సంజయ్‌దత్‌


క్యాన్సర్‌ నుండి సంజయ్‌దత్‌ బయటపడినట్లు ప్రకటించారు. గత కొన్ని నెలల క్రితం ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్ చివరకు తాను క్యాన్సను జయించినట్లు ప్రకటించాడు. తన పిల్లలైన షహ్రాన్, ఇక్రాల పుట్టినరోజు నాడే ఈ ప్రకటన వెలువడటం ఎంతో సంతోషంగా ఉందని ఒక పొడవాటి పోస్ట్‌తో ట్విట్టర్‌లో ఈ వార్తను పంచుకున్నాడు. క్యాన్సర్‌ రహితంగా బయటపడినట్లు వచ్చిన వార్తను ఈ రోజు మీ అందరితో పంచుకున్నప్పుడు నా హృదయం కృతజ్ఞతతో నిండి ఉంది. గత కొన్ని వారాలు తనకు, తన కుటుంబానికి చాలా కష్టంగా గడిచాయని తన నోట్‌లో వెల్లడించారు. దేవుడు తన బలమైన సైనికులకు కష్టతరమైన యుద్ధాలను ఇస్తాడని ఈ రోజు నా పిల్లల పుట్టినరోజు సందర్భంగా ఈ యుద్ధం నుండి విజయం సాధించి బయటపడటం ఎంతో సంతోషకరంగా ఉన్నది అని తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. దీనిపై అభిమానులు చాలా సంతోషించారు.

అతను అనారోగ్యంతో బాదపడినట్లు తెలియడంతో అభిమానులంతా కృంగిపోయారు. తన జీవితంలో ఈ కఠినమైన దశలో అండగా నిలిచిన తన అభిమానులకు, సన్నిహితులకు కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరి అచంచలమైన విశ్వాసం, మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదన్నారు. ఈ వ్యాధితో పోరాడటానికి, తిరిగి ఆరోగ్యంగా మారడానికి సహాయం చేసిన కోకిలాబెన్‌ హాస్పిటల్లోని డాక్టర్ సెవాంటి, ఆమె వైద్యబృందానికి, నర్సులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. వైద్య చికిత్స కోసం తాను స్వల్ప విరామం తీసుకుంటున్నట్లు ఈ ఏడాది ఆగస్టులో సంజయ్ సోషల్ మీడియాలో ప్రకటించారు. అతను ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని అనంతరం వెల్లడైంది. ఇది అతని అభిమానులను, సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎట్టకేలకు తమ అభిమాన నటుడు క్యాన్సర్‌ను జయించి తిరిగి మామూలు మనిషిగా మారడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Advertisement