Advertisement

శానిటైజర్ గణేష్ విగ్రహాలు

By: chandrasekar Wed, 19 Aug 2020 09:57 AM

శానిటైజర్ గణేష్ విగ్రహాలు


దేశంలో కరోనా విజృంభిస్తుండడంతో రానున్న వినాయక చవితికి కొత్తగా శానిటైజర్ గణేష్ విగ్రహాలు తాయారు చేస్తున్నారు. కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలోనే వినాయక చవితి వేడుకలు కూడా రావడం కొవిడ్ మార్గదర్శకాలు, నిబంధనల మధ్యే వినాయక చవితి వేడుకలు చేసుకోవాల్సి రావడం గణేష్ భక్తులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. కరోనా మహమ్మారికి చెక్ పెట్టడానికి కొవిడ్-19 మార్గదర్శకాలు పాటించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.

వినాయక చవితి కోసం గణేష్ విగ్రహాలు సిద్ధం చేస్తోన్న కళాకారులు కూడా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే తమ క్రియోటివిటీకి మరింత పదును పెడుతున్నారు. అందుకు ఫలితమే ఈ శానిటైజర్ గణేషా విగ్రహాలు. ప్రజల మధ్య అవగాహనా పెంచడానికి శుభ్రతను అలవరచుకోవడానికి ఇవి తాయారు చేసినట్లు తెలిపారు.

మహారాష్ట్ర ముంబైలోని ఘట్కోపర్‌లో ఓ కళాకారుడు శానిటైజర్స్‌ని ఆటోమేటిక్‌గా డిస్పెన్స్ చేసే వినాయకుడి విగ్రహాలను రూపొందిస్తున్నాడు. కరోనావైరస్ పై అవగాహన కల్పించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నానికి కస్టమర్ల నుంచి మంచి ఆధరణ కూడా లభిస్తోంది తెలిపాడు.

కొత్తగా తాయారు చేసిన వినాయకుడి విగ్రహానికి ఓ వైపున ఏర్పాటు చేసిన శానిటైజర్ కింద చేయి పెడితే ఆటోమేటిక్‌గా శానిటైజర్ డిస్పెన్స్ అవుతుందని ఈ విగ్రహాలను తయారు చేస్తోన్న కళాకారుడు చెబుతున్నాడు. ఇందుకు సెన్సార్ టెక్నాలజీని ఉపయోగించినట్టు వివరించాడు. వచ్చిన భక్తులకు వినాయకుడు శానిటైజర్ అందించినట్లు అవుతుంది.

Tags :
|

Advertisement