Advertisement

  • ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో బాబర్ అజామ్ పై 'నిన్ను చంపేస్తా' అన్న సానియా మీర్జా

ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో బాబర్ అజామ్ పై 'నిన్ను చంపేస్తా' అన్న సానియా మీర్జా

By: chandrasekar Sat, 27 June 2020 6:26 PM

ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో బాబర్ అజామ్ పై 'నిన్ను చంపేస్తా' అన్న సానియా మీర్జా


మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌ కోసం ఇంగ్లాండ్ పర్యటనకి ఆదివారం పాకిస్థాన్ జట్టు వెళ్లనుండగా మాలిక్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో తాజాగా బాబర్ అజామ్ మాట్లాడాడు. ఈ సందర్భంగా మాలిక్ సరదాగా అడిగిన ఓ ప్రశ్నకి సమాధానమిచ్చిన బాబర్ అజామ్ సానియా మీర్జా ఆగ్రహానికి గురయ్యాడు. పాకిస్థాన్ వన్డే/ టీ20 కెప్టెన్ బాబర్ అజామ్‌కి భారత టెన్నిస్ స్టార్, పాక్ సీనియర్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జా నుంచి ఊహించని విధంగా వార్నింగ్ వెళ్లింది.

ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో బాబర్ అజామ్ ప్రొఫెషనల్, పర్సనల్ విషయాల గురించి కాసేపు ప్రశ్నలు అడిగిన షోయబ్ మాలిక్ పాక్ జట్టులోని క్రికెటర్ల ఫ్యామిలీస్‌తో అనుబంధం గురించి ఆరా తీస్తూ 'నీ ఫేవరెట్ వదిన ఎవరు..?’ అని అడిగాడు. దాంతో క్షణం కూడా ఆలోచించకుండా మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ భార్య సైదా ఖుస్బత్ పేరుని బాబర్ చెప్పేశాడు. సానియా మీర్జాతో అప్పటి వరకూ బాబర్‌ అజామ్‌కి ఉన్న ఫ్రెండ్‌షిప్ కారణంగా ఆమె పేరుని చెప్తాడని ఊహించిన షోయబ్ మాలిక్‌కి ఊహించని సమాధానంతో ఎలా స్పందించాలో కొన్ని క్షణాలు అర్థంకాలేదు.

బాబర్ అజామ్ సమాధానంతో రంగంలోకి దిగిన సానియా మీర్జా 'నిన్ను చంపేస్తా' అని కామెంట్‌ పెట్టింది. అంతేకాకుండా ఇకపై నిన్ను మా మంచంపై పడుకోబెట్టుకునేది లేదని మరో కామెంట్ రూపంలో స్పష్టం చేసింది. ఇంగ్లాండ్ టూర్‌కి ఆదివారమే పాక్ జట్టు వెళ్లనుండగా షోయబ్ మాలిక్ మాత్రం జులై మూడో వారంలో అక్కడికి వెళ్లనున్నాడు. లాక్‌డౌన్ కారణంగా సానియా మీర్జాకి గత ఐదు నెలలుగా దూరంగా ఉన్న మాలిక్ కొన్ని రోజులు వారితో గడిపి నెల రోజుల ఆలస్యంగా టూర్‌కి వెళ్తానని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి పర్మీషన్ కూడా తెచ్చుకున్నాడు.

Tags :

Advertisement