Advertisement

సంగారెడ్డి లో కరోనాతో మహిళా కౌన్సిలర్ మృతి

By: Sankar Mon, 06 July 2020 3:59 PM

సంగారెడ్డి లో కరోనాతో మహిళా కౌన్సిలర్ మృతి



తెలంగాణాలో కరోనా మహమ్మారి విశ్వరూపం దాల్చింది కేవలం ఒక్క నెలలోనే కరోనా తీవ్రత మాములు స్థాయి నుంచి భయానక స్థాయికి చేరుకుంది ..రోజుకి వెయ్యి నుంచి రెండు వేల మధ్య కరోనా కేసులు నమోదు అవుతున్నాయి ..మొన్నటిదాకా కేవలం హైదరాబాద్ ,రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాలో కేసులు నమోదు కాగా , గత వారం నుంచి ఈ కరోనా జిల్లాలకు కూడా పాకింది ..

తాజాగా సంగారెడ్డి జిల్లాలో మహిళా కౌన్సిలర్‌ కరోనాతో మృతిచెందారు.కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆమెకు ఐదు రోజుల క్రితం పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆమె హైదరాబాద్‌లోని ఛాతీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమె ఈ రోజు మరణించినట్లు జిల్లా వైద్యాధికారి ప్రకటించారు. ఆమె కొడుకుకు కూడా కరోనా సోకిందని, ఆయన ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆదివారం తెలంగాణలో 1590 మందికి పాజిటివ్ వ‌చ్చింద‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. 5290 శాంపిల్స్ ప‌రీక్షించారు. ఈ కేసుల్లో ఒక్క గ్రేట‌ర్‌ హైద‌రాబాద్‌లోనే 1277 మంది ఉన్నారు. తాజా కేసుల‌తో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 23,902కి చేరింది. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో ఏడుగురు క‌రోనా పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 295కి పెరిగింది.

Tags :
|
|
|

Advertisement