Advertisement

బాటా గ్లోబల్ కు తొలి ఇండియన్ సీఈఓ

By: Sankar Tue, 01 Dec 2020 9:41 PM

బాటా గ్లోబల్ కు తొలి ఇండియన్ సీఈఓ


ఫుట్‌వేర్‌ దిగ్గజం బాటా గ్రూప్‌ గ్లోబల్‌ సీఈవోగా తొలిసారి ఒక భారతీయుడు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం బాటా ఇండియా సీఈవోగా వ్యవహరిస్తున్న సందీప్‌ కటారియా ఇందుకు ఎంపికయ్యారు.

ఐదేళ్లపాటు బాటా గ్రూప్‌నకు సేవలందించిన చీఫ్‌ అలెగ్జిస్‌ నసార్డ్‌ నుంచి బాటా గ్లోబల్‌ పగ్గాలను సందీప్‌ అందుకోనున్నారు. తద్వారా 126 ఏళ్ల చరిత్ర కలిగిన బాటా గ్రూప్‌ను నడిపించనున్న తొలి భారత సీఈవోగా నిలవనున్నారు. వెరసి దిగ్గజ కంపెనీలకు నేతృత్వం వహిస్తున్న సుప్రసిద్ధ దేశీ సీఈవోల సరసన సందీప్‌ చోటు సాధించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు.

ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు సత్య నాదెళ్ల, ఇంటర్నెట్‌ దిగ్గజం అల్ఫాబెట్‌కు సుందర్‌ పిచాయ్‌, మాస్టర్‌కార్డ్‌కు అజయ్‌ బంగా, ఐబీఎంకు అరవింద్‌ కృష్ణ, ఎఫ్‌ఎంసీజీ కంపెనీ రెకిట్‌ బెంకిసర్‌కు లక్ష్మణ్‌ నారాయణ్‌, నోవర్తిస్‌కు వసంత్‌ నారాయణ్ సేవలు అందిస్తున్న విషయాన్ని ఈ సందర్బంగా ప్రస్తావించారు.

Tags :
|
|
|

Advertisement