Advertisement

  • సాంసంగ్ కంపెనీ 6,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో ఫోన్లు రిలీజ్

సాంసంగ్ కంపెనీ 6,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో ఫోన్లు రిలీజ్

By: chandrasekar Wed, 08 July 2020 11:33 AM

సాంసంగ్ కంపెనీ 6,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో ఫోన్లు రిలీజ్


మార్కెట్‌లో సాంసంగ్ భారీ బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయబోతోంది. ఇప్పటికే 6,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో స్మార్ట్‌ఫోన్లను ఇండియాలో రిలీజ్ చేసింది సాంసంగ్. ఇప్పుడు మార్కెట్లో ఉన్న అన్ని బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే 6,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ. ఒకప్పుడు 4,000ఎంఏహెచ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే చాలనుకున్నారు. కానీ యూసేజ్ పెరగడంతో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్లు రావడం మొదలైంది.

కానీ సాంసంగ్ ఏకంగా 6,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో ఫోన్లు రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది. సాంసంగ్ అంతటితో ఆగట్లేదు. అంతకన్నా ఎక్కువ బ్యాటరీ కెపాసిటీతో స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. సాంసంగ్ ఎం సిరీస్‌లో భాగంగా గెలాక్సీ ఎం41 మోడల్ రాబోతోంది. ఈ ఫోన్ బ్యాటరీ ఎంతో తెలుసా? 6,800ఎంఏహెచ్. ఏకంగా 6,800ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో సాంసంగ్ గెలాక్సీ ఎం41 స్మార్ట్‌ఫోన్ ప్రపంచానికి పరిచయమయ్యే అవకాశముంది. ఈ విషయాన్ని కంపెనీ ఇంకా ధృవీకరించలేదు.

ఓ స్మార్ట్‌ఫోన్‌లో ఇంత భారీ బ్యాటరీ ఉండటం సంచలనమే. సాంసంగ్ గెలాక్సీ ఎం41 స్మార్ట్‌ఫోన్‌లో 64+12+5 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, ఎక్సినోస్ 9630 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్ లాంటి ఫీచర్స్ ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంసంగ్ గెలాక్సీ ఎం40 కన్నా కాస్త ఎక్కువ ఫీచర్స్‌తో సాంసంగ్ గెలాక్సీ ఎం41 రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ.

Tags :
|

Advertisement