Advertisement

  • శామ్‌స౦గ్ ఆఫర్స్: టీవీ, ఫ్రిడ్జ్, ఏసీలపై పండగ ఆఫర్లు

శామ్‌స౦గ్ ఆఫర్స్: టీవీ, ఫ్రిడ్జ్, ఏసీలపై పండగ ఆఫర్లు

By: chandrasekar Wed, 14 Oct 2020 4:21 PM

శామ్‌స౦గ్ ఆఫర్స్: టీవీ, ఫ్రిడ్జ్, ఏసీలపై పండగ ఆఫర్లు


శామ్‌స౦గ్ దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని తమ ఉత్పత్తులపై ఆఫర్లను ప్రకటించింది. వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ లో శామ్‌స౦గ్ టీవీలు, డిజిటల్ అప్లయెన్సస్ తగ్గింపులు, ఒప్పందాలను ప్రకటించింది. శామ్‌స౦గ్ ఉత్పత్తుల కొనుగోలుపై ఆఫర్లు, డిస్కౌంట్లతో పాటు గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్ ఫోన్ ‌ను గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, రూ .805 కన్నా తక్కువ ఈఎంఐ ఆప్షన్లు, రూ.2,000 వరకు క్యాష్ బ్యాక్ వంటివి ఉన్నాయి. పండుగ సీజన్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్ల భాగస్వామ్యంతో తమ టెలివిజన్లు, గృహోపకరణాలపై ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నామని శామ్‌స౦గ్ ఇండియా ఆన్లైన్ బిజినెస్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ పియూష్ కున్నపల్లిల్ ఒక ప్రకటనలో తెలియజేసారు.

భారీ తగ్గింపులు

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ అక్టోబర్ 16 నుంచి, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అక్టోబర్ 17 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సీజన్లో శామ్సంగ్ ది ఫ్రేమ్ లైఫ్ స్టైల్ టీవీని ఫ్లిప్ కార్ట్ లో తక్కువ ధరకే అందించనున్నారు. ఈ టీవీ 50 అంగుళాల వేరియంట్ ధరను రూ.72,990గా నిర్ణయించారు. 55 అంగుళాల వేరియంట్ రూ.81,990, 65-అంగుళాల వేరియంట్ రూ.1,29,990కు లభిస్తుంది. శామ్‌స౦గ్ సెరిఫ్ టీవీపై కూడా తగ్గింపులను ప్రకటించారు. ఈ మోడల్ టీవీని అమెజాన్లో తక్కువ ధరలకు అందించనున్నారు. 43-అంగుళాల టీవీ ధర రూ.64,990, 49 అంగుళాల వేరియంట్ ధర రూ.84,990, 55-అంగుళాల వేరియంట్ ధరను రూ.99,990గా నిర్ణయించారు. ఈ ఆఫర్లకు అదనంగా 24 నెలల ఈఎంఐ సదుపాయం, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, రూ.2,000 వరకు క్యాష్బ్యాక్ను కూడా వినియోగదారులు పొందవచ్చని కంపెనీ తెలిపింది.

ఫ్లిప్ కార్ట్ లో శామ్‌స౦గ్ స్పేస్మాక్స్ ఫ్యామిలీ హు ఫ్రిజ్ను కొన్న వినియోగదారులకు పది శాతం క్యాష్బ్యాక్ లభించనుంది. దీంతోపాటు రూ.37,999 విలువైన గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్ ఫోన్ ఉచితంగా లభిస్తుంది. శామ్‌స౦గ్ కర్డ్ మాస్ట్రో (244లీటర్లు) ఫ్రిజ్ కొనుగోలుపై రూ.5 వేల తగ్గింపును పొందవచ్చు. ఆఫర్లో ఇది రూ.25,990కే లభిస్తుంది. ఈ ఫ్రిజ్ను రూ.2,166 నుంచి ప్రారంభమయ్యే ఈఎంఐ ఆప్షన్‌లో కొనుక్కోవచ్చు. శామ్‌స౦గ్ 1.5 టన్ కన్వర్టబుల్ ఇన్వర్టర్ ఏసీలు ఫ్లిప్ కార్ట్ లో తక్కువ ధరలకే లభించనున్నాయి. వీటిలో 5 స్టార్ ఏసీని రూ.31,990 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. 3 స్టార్ మోడల్ ధర రూ.27,990గా నిర్ణయించారు. దీంతోపాటు ఇటీవల విడుదల చేసిన ఏడు కేజీల శామ్‌స౦గ్ వాషర్ డ్రైయర్స్ రూ.6,600 తగ్గింపుతో, రూ.38,990కు లభిస్తుందని శామ్సంగ్ పేర్కొంది.

Tags :
|
|

Advertisement