Advertisement

  • శాంసంగ్‌ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది

శాంసంగ్‌ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది

By: chandrasekar Fri, 17 July 2020 11:35 AM

శాంసంగ్‌ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది


శాంసంగ్‌ భారతదేశంలో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు శాంసంగ్‌ గురువారం ప్రకటించింది. గెలాక్సీ M01s పేరుతో విడుదల కానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను రూ. 9,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ శాంసంగ్‌ ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాలు, శాంసంగ్‌.కామ్‌, ఇతర ప్రధాన ఇ-కామర్స్ పోర్టల్‌లలో అందుబాటులో ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ M01s 6.2-అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ టీఎఫ్‌టీ డీస్‌ప్లేతో ముందు భాగంలో ఇన్ఫినిటీ-వీ కటౌట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సెన్సార్లతో కూడిన రెండు వెనుక కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో పీ22 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పాటు 3 జీబీ ర్యామ్, 32 జీబీ రోమ్‌తో ఏర్పడి ఉంది. 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో పనిచేస్తుంది.

శాంసంగ్‌ విడుదల చేయనున్న ఈ కొత్త పోన్‌ వెనుక భాగంలో సెన్సార్‌ ఫంగర్‌ ప్రింట్‌ అన్‌లాక్‌ను కూడా కలిగి ఉంది. అంతే కాకుండా ఫేస్‌ అన్‌లాక్‌ సిస్టమ్‌కూడా ఇందులో అందుబాటులో ఉంది. ఇది ఆండ్రాయిడ్‌ 10 ఆధారిత వన్‌ యూఎల్‌ కోర్‌లో నడుస్తుంది. ఈ మొబైల్‌ లైట్ బ్లూ, గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.

ధర, స్పెసిఫికేషన్ల ఆధారంగా శాంసంగ్‌ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌ మీ నార్జో 10ఏ, షియోమి రెడ్‌మీ 8 వంటి వాటితో పోటీపడుతుంది. రూ. 9,799 ధరతో రెడ్‌మీ 8 12 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది యూఎస్‌బీ టైప్-సీ సపోర్ట్, 18 వాట్ల ఛార్జింగ్ తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఉంది. ఇది 6.22 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంది.

అదే విధంగా రియల్‌మీ నార్జో 10ఏ ఆన్‌లైన్‌లో రూ. 8,999కు లభిస్తుంది. ఫోన్ 12 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది 10 వాట్ల ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. ఇది 256 జీబీ వరకు మెమరీ కార్డు సామర్థ్యాన్ని కలిగి ఉంది. రియల్‌మీ నార్జో 10ఏ హెచ్‌డీ రిసల్యేషన్‌తో 6.5 అంగుళాల ఎల్‌సీడీని కలిగి ఉంది.

Tags :
|
|

Advertisement