Advertisement

  • శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఫ్యాన్ ఎడిషన్ మనదేశంలో లాంచ్

శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఫ్యాన్ ఎడిషన్ మనదేశంలో లాంచ్

By: chandrasekar Wed, 07 Oct 2020 4:28 PM

శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఫ్యాన్ ఎడిషన్ మనదేశంలో లాంచ్


మనదేశంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఫ్యాన్ ఎడిషన్ అధికారికంగా లాంచ్ చేసారు. దీనికి సంబంధించిన సేల్ అక్టోబర్ 16వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభం అవనుంది. శాంసంగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్20కి టోన్డ్ డౌన్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఒక్క స్టోరేజ్ వేరియంట్, ఐదు కలర్ ఆప్షన్లు దీనిలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు, ముందువైపు పంచ్ హోల్ కెమెరా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త స్మార్ట్ ఫోన్‌ను శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ అని కూడా పిలుస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్20, గెలాక్సీ నోట్ 20 సిరీస్ ఫోన్ల డిజైన్ తరహాలోనే దీని డిజైన్ కూడా ఉంది. ఇందులో వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ ధర మరియు స్పెసిఫికేషన్లు

శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ ధరను మనదేశంలో రూ.49,999గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

క్లౌడ్ రెడ్, క్లౌడ్ లావెండర్, క్లౌడ్ మింట్, క్లౌడ్ నేవీ, క్లౌడ్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు అక్టోబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అమెజాన్, శాంసంగ్ వెబ్ సైట్లతో మరిన్ని ఆఫ్ లైన్ స్టోర్లలో అక్టోబర్ 16వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది.

గ్లోబల్ వెర్షన్‌లో మాత్రం ఇందులో 4జీ, 5జీ మోడళ్లతో పాటు మూడు స్టోరేజ్ ఆప్షన్లను కంపెనీ లాంచ్ చేసింది. క్లౌడ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్ కూడా మనదేశంలో లాంచ్ కాలేదు. దీని ధరను గ్లోబల్ మార్కెట్లలో 699 డాలర్ల(సుమారు రూ.51,100) నుంచి ప్రారంభం కానుంది.

దీనిలో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్ ఫినిటీ-ఓ డిస్ ప్లేను కంపెనీ అందించింది. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ గా ఉంది.

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు. ఆక్టాకోర్ ఎక్సినోస్ 990 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్ సామర్థ్యాన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఈ ఫోన్ గ్లోబల్ వేరియంట్లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్‌ను అందించారు
ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి.

ఇందులో కూడా ప్రధాన కెమెరాగా 12 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ ను అందించగా, దీంతోపాటు 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 8 మెగా పిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా అందించారు.

ఈ ఫోన్ ప్రధాన కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీల కోసం ముందువైపు 32 మెగా పిక్సెల్ కెమెరాను శాంసంగ్ అందించింది.

ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ పనిచేయనుంది.

4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్ బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లను ఇందులో కంపెనీ అందించింది.

ఇందులో శాంసంగ్ బ్రాండ్ ఏకేజీ ఆప్టిమైజ్ చేసిన స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.
యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, హాల్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ గా ఉంది.

15W ఫాస్ట్ చార్జింగ్ ను ఇది సపోర్ట్ చేయనుంది. వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు. దీని మందం 0.84 సెంటీమీటర్లుగానూ ఉంది. దీని బరువు 190 గ్రాములు.


Tags :
|

Advertisement