Advertisement

శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఫ్యాన్ ఎడిషన్

By: chandrasekar Fri, 25 Sept 2020 09:05 AM

శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఫ్యాన్ ఎడిషన్


ప్రముఖ కొరియన్ కంపెనీ శంసుంగ్ తన ప్రీమియం ఫోన్ గెలాక్సీ ఎస్20 ఫ్యాన్ ఎడిషన్ లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఫ్యాన్ ఎడిషన్ లాంచ్ అయింది. దీని గురించి ఇప్పటివరకు ఎన్నో లీకులు వినిపించాయి. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్20, గెలాక్సీ నోట్ 20 సిరీస్ డిజైన్‌తో మ్యాచ్ అవ్వడం విశేషం. వెనకవైపు మూడు కెమెరాలు, హోల్ పంచ్ డిస్ ప్లే ఇందులో కూడా అందించారు. ఇందులో ఆరు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో 120 హెర్జ్ట్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ను శాంసంగ్ అందించింది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఫ్యాన్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు:

* ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్ ఫినిటీ-ఓ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ గా ఉంది.

* ఈ ఫోన్ 5జీ వేరియంట్లో ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ ను అందించారు.

* 4జీ వేరియంట్లో ఎక్సినోస్ 990 ప్రాసెసర్ అందుబాటులో ఉంది.

* 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో కూడా ఉన్నాయి.

* ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కూడా ప్రధాన కెమెరాగా 12 మెగా పిక్సెల్ సెన్సార్ ను అందించగా, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 8 మెగా పిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా ఉన్నాయి.

* సెల్ఫీల కోసం ముందువైపు 32 మెగా పిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

* ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్ బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లను ఇందులో అందించారు.

* బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ గా ఉంది. 15W ఫాస్ట్ చార్జింగ్ ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.84 సెంటీమీటర్లుగానూ, బరువు 190 గ్రాములు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఫ్యాన్ ఎడిషన్ 5జీ వేరియంట్ ధర 699 డాలర్ల నుంచి (సుమారు రూ.51,400) ప్రారంభం కానుంది. 4జీ వేరియంట్ ధర ఇంకా తెలియరాలేదు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. క్లౌడ్ రెడ్, క్లౌడ్ ఆరెంజ్, క్లౌడ్ లావెండర్, క్లౌడ్ మింట్, క్లౌడ్ నేవీ, క్లౌడ్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అక్టోబర్ 2వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. మనదేశంలో ఎప్పుడు సేల్ చేస్తారని ఇంకా చెప్పలేదు.

Tags :
|

Advertisement