Advertisement

  • ఆన్‌లైన్‌లో లీకైన శాంసంగ్ గెలాక్సీ ఎం12 ఫొటోలు, ఫీచర్స్...

ఆన్‌లైన్‌లో లీకైన శాంసంగ్ గెలాక్సీ ఎం12 ఫొటోలు, ఫీచర్స్...

By: chandrasekar Wed, 18 Nov 2020 5:12 PM

ఆన్‌లైన్‌లో లీకైన శాంసంగ్ గెలాక్సీ ఎం12 ఫొటోలు, ఫీచర్స్...


శాంసంగ్ గెలాక్సీ ఎం12 స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ఫొటోలు, ఫీచర్స్ ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ ఇమేజెస్ ప్రకారం ఈ ఫోన్ ఈమధ్యే లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఏ42 5జీ తరహాలో ఉండనుంది. అయితే డిజైన్‌లో కొన్ని మార్పులు ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎం12 సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కనిపించగా, శాంసంగ్ గెలాక్సీ ఏ42 5జీలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనకవైపు అందించారు. దీని ధర కూడా శాంసంగ్ గెలాక్సీ ఏ42 5జీ కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉంది.

స్పెసిఫికేషన్స్...

ప్రముఖ టిప్ స్టర్ ఆన్‌లీక్స్ వీటికి సంబంధించిన రెండర్లను ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. ఈ ఫోన్ ప్లాస్టిక్ యూనీబాడీతో రానుందని, ఫ్లాట్ డిస్ ప్లే, వాటర్ డ్రాప్ తరహా నాచ్ వంటివి ఉండవచ్చని లీకుల ద్వారా తెలుస్తోంది.

ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో వెనకవైపు చదరం ఆకారంలో ఉన్న కెమెరా మాడ్యూల్‌లో నాలుగు కెమెరాలు ఉండనున్నాయి.

శాంసంగ్ లోగో ఫోన్ కింద భాగంలో ఉండనుంది. పిక్సెల్ 3 సిరీస్‌లో కూడా ఇదే తరహా డిజైన్‌ను అందించారు.

లీకైన రెండర్ల ప్రకారం శాంసంగ్ గెలాక్సీ ఎం12లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించనున్నారు.

ఫోన్ కింద భాగంలో యూఎస్‌బీ టైప్-సీ పోర్టును అందించారు. స్పీకర్ గ్రిల్, 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఇందులో అందించనున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎం12 డిజైన్ గెలాక్సీ ఏ42 5జీ తరహాలోనే ఉండనుంది. ఈ శాంసంగ్ గెలాక్సీ ఎం12 స్మార్ట్ ఫోన్ 2021 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

గతంలో వచ్చిన కథనాల ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ ఎం12 స్మార్ట్ ఫోన్‌లో 6.7 అంగుళాల డిస్ ప్లేను అందించారు.

హోల్ పంచ్‌లో సెల్ఫీ కెమెరాను అందించనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం లీకైన రెండర్ల ప్రకారం ఇందులో వాటర్ డ్రాప్ తరహా డిస్‌ప్లేను అందిస్తున్నారు.

అలాగే ఇందులో 7000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నట్లు సమాచారం.

Tags :
|
|
|
|
|

Advertisement