Advertisement

  • 6 జి కోసం సిద్ధమవుతోన్న శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్

6 జి కోసం సిద్ధమవుతోన్న శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్

By: chandrasekar Wed, 15 July 2020 11:19 AM

6 జి కోసం సిద్ధమవుతోన్న శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్


5 జి నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంలో చైనా బిజీగా ఉంది. కానీ సౌత్ కొరియా టెక్నాలజీ జెయింట్ శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు 6 జి కోసం సిద్ధమవుతోంది. 2028 నాటికి 6 జి కమర్షియల్ గా మార్కెట్లోకి వస్తుందని శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. కాగా 2030 నాటికి 6 జి నెట్‌వర్క్ మెయిన్ స్ట్రీమ్ లో ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. దీనిపై సంస్థ ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ శ్వేతపత్రం ద్వారా సంస్థ తన 6 జి ఐడియాను బయటపెట్టింది. ఈ పేపర్‌కు కంపెనీ 'ది నెక్స్ట్ హైపర్ కనెక్టెడ్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ ఆల్' అని పేరు పెట్టారు. వైట్ పేపర్ లో సంస్థ సాంకేతిక, సామాజిక మెగాట్రెండ్స్, కొత్త సేవలు, అవసరాలు మరియు సేవల గురించి వివరించింది.

అయితే అటు 5 జి నెట్‌వర్క్‌ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని శామ్‌సంగ్ తెలిపింది. అటువంటి పరిస్థితిలో, కాగా ఇప్పటి నుండి 6 జి నెట్‌వర్క్‌ను సిద్ధం చేయడం మంచి దశ అని కంపెనీ తెలిపింది, నిజానికి నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి ఒక దశాబ్దం పడుతుందని, అటువంటి పరిస్థితిలో, 6 జి నెట్‌వర్క్ తయారీ ఇప్పటి నుంచీ ప్రారంభిస్తే, ఈ నెట్‌వర్క్‌ను నిర్ణీత సమయంలోనే అభివృద్ధి చేయవచ్చని అందులో తెలిపింది.

అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ రీసెర్చ్ సెంటర్ హెడ్ సున్ఘ్యూన్ చోయి మాట్లాడుతూ, 6 జి నెట్‌వర్క్ కోసం కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఈ దశలో కంపెనీ అవసరమైన అన్ని పరిణామాలపై కృషి చేస్తోందని అన్నారు. 6 జి నెట్‌వర్క్ ప్రమాణాలను నిర్దేశించడానికి, జపాన్ సన్నద్ధమవుతున్నట్లు గతంలో నిక్కీలో ఓ నివేదిక ద్వారా బయటకు వచ్చింది. నిక్కీ నివేదిక ప్రకారం, జపాన్ 6 జి నెట్‌వర్క్ గురించి వివరించింది. అయితే, 5 జి నెట్‌వర్క్ టెక్నాలజీలో జపాన్ ప్రపంచంలోని అనేక దేశాల కంటే ఇంకా వెనుకబడి ఉంది. కానీ జపాన్ మాత్రం 6 జి నెట్‌వర్క్ ప్రస్తుత 5 జి కంటే 10 రెట్లు వేగంగా ఉంటుందని తెలిపింది.

Tags :
|

Advertisement