Advertisement

  • యాపిల్‌ను దారుణంగా ట్రోల్ చేసిన శాంసంగ్ మరియు షియోమీ

యాపిల్‌ను దారుణంగా ట్రోల్ చేసిన శాంసంగ్ మరియు షియోమీ

By: chandrasekar Tue, 20 Oct 2020 09:21 AM

యాపిల్‌ను దారుణంగా ట్రోల్ చేసిన శాంసంగ్ మరియు షియోమీ


ప్రీమియం ఫోన్ కంపెనీ యాపిల్‌ను శాంసంగ్ మరియు షియోమీ కంపెనీలు దారుణంగా ట్రోల్ చేశాయి. అమెరికన్ మల్టీనేషనల్ టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల ఐఫోన్ 12 సిరీస్‌ను లాంచ్ చేసి తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది. ఈ మోడల్‌ ఫోన్లతో చార్జర్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ ఇవ్వకపోడమే ఈ విమర్శలకు కారణం. చార్జర్ లేని ఫోన్లను కొని ఏం చేసుకోవాలంటూ యాపిల్ అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. వేలకువేలు పోసి కొనుగోలు చేసే ఫోన్‌కు చార్జర్ ఇవ్వకపోవడం ఏంటంటూ కొందరు వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లతో చార్జర్, ఇయర్ ఫోన్స్ ఇవ్వడం లేదన్న వార్త బయటకు వచ్చిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఆండ్రాయిడ్ కంపెనీలు దాడి మొదలుపెట్టాయి. యాపిల్‌ను దారుణంగా ట్రోల్ చేశాయి.

అసలు ముఖ్యమైన చార్జర్ ను ఇవ్వక పోవడంతో యాపిల్ ప్రత్యర్థి శాంసంగ్ అయితే యాపిల్‌ను లక్ష్యంగా చేసుకుంది. తాము మాత్రం చార్జర్ ఇస్తామంటూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేసింది. ఇప్పుడు ఈ జాబితాలో చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ కూడా చేరింది. యాపిల్‌ను లక్ష్యంగా చేసుకుని ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. షియోమీ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ‘ఎంఐ 10టీ ప్రొ’ని కొనుగోలు చేసిన వ్యక్తి అన్‌బాక్సింగ్ చేస్తాడు. అందులో చార్జర్ కూడా కనిపిస్తుంది అందు కోసం చింతించకండి, ఎంఐ 10టి ప్రొ తో మేం దేనినీ విడిచిపెట్టడం లేదు అని ఈ వీడియోకు క్యాప్షన్ తగిలించింది. గతవారం ఈ వీడియోను షేర్‌ చేయగా ఇప్పటికే మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. 34 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags :
|

Advertisement