Advertisement

  • నువ్వు నా వాడివి ..నేను నీ దానిని ..భర్తకు పెళ్లి రోజు విషెస్ చెప్పిన సమంత

నువ్వు నా వాడివి ..నేను నీ దానిని ..భర్తకు పెళ్లి రోజు విషెస్ చెప్పిన సమంత

By: Sankar Tue, 06 Oct 2020 5:03 PM

నువ్వు నా వాడివి ..నేను నీ దానిని ..భర్తకు పెళ్లి రోజు విషెస్ చెప్పిన సమంత


క్యూట్ భామ సమంత అక్కినేని వారి కోడలుగా అడుగు పెట్టి నేటితో మూడేళ్లయింది. ఈ జంట మూడవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన హబ్బీ చైతూకు సామ్ శుభాకాంక్షలు తెలిపింది.

ఇన్ స్టాలో ఒక అందమైన ఫోటోని షేర్ చేసిన సామ్ ఎమోషనల్ గా స్పందించింది. 'నువ్వు నా వాడివి.. నేను నీ దాన్ని. మనం ఏ తలపు వచ్చినా.. మేం దానిని కలిసి తెరుస్తాము. నా శ్రీవారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు' అని రాసుకొచ్చింది సమంత. అలాగే ఈ కొటేషన్ కు బ్లాక్ అండ్ వైట్ ఫోటోను జత చేసింది.

6 అక్టోబర్ 2017 న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకున్నారు. హిందూ - క్రైస్తవ విధానాల్లో పెళ్లి జరిగింది. ఇక ఈ జంట కు సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన, వెన్నెల కిశోర్‌, ప్రియమణి, ప్రగ్యా జైశ్వాల్‌, మంచు లక్ష్మి, కోన నీరజ, రాశీ ఖన్నా, కృతి కర్బందా, చిన్మయి ఇంకా చాలా మంది ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Tags :
|
|

Advertisement