Advertisement

  • వైద్య సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నాను .. తెలంగాణ గవర్నర్ తమిళసై

వైద్య సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నాను .. తెలంగాణ గవర్నర్ తమిళసై

By: Sankar Wed, 01 July 2020 7:59 PM

వైద్య సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నాను .. తెలంగాణ గవర్నర్ తమిళసై



బుధవారం డాక్టర్స్‌డే సందర్భంగా గవర్నర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాజ్‌భవన్‌ నుంచి ప్రముఖ వైద్యులతో, వివిధ ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లతో చర్చించారు. కోవిడ్‌ సంక్షోభ సమయంలో డాక్టర్లు తమ ఆరోగ్యాన్ని ,తమ కుంటుబ సభ్యుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి రోగులను కాపాడడంలో గొప్ప సేవలు చేస్తున్నారని అన్నారు. వారుచూపిస్తున్న అసమాన సేవలు,త్యాగాలకు, డాక్టర్లకు, మెడికల్‌ సిబ్బందికి సెల్యూట్‌చేస్తున్నానని గవర్నర్‌ అన్నారు.

డాక్టర్‌గా తానూ వైద్యులతో, సిబ్బందితో ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతున్నానని, ఈ సంక్షోభసమయంలో వారు చేస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించి సహకరించాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. కోవిడ్‌తో ప్రజలు ఆందోళనకు గురి కావద్దని, తగు నివారన చర్యలతో కరోనా వ్యాప్తిని అందరం కలిసి అడ్డుకోగలమని ఆమె వివరించారు. కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్‌ పరిస్థితిని సరైన రీతిలోనే ఎదుర్కొంటున్నాయని,కావాల్సిన మందులు, పిపిఈకిట్లు, మాస్కులు, వసతులు సరిపడా ఉన్నాయని, ప్రజలు ఎవరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.

ప్రజల అవగాహన, చైతన్యం, వారి భాగస్వామ్యంతోనే కరోనాకి అడ్డుకట్ట వేయగలమని అన్నారు. కొన్ని రకాల సోషల్‌ మీడియా పోస్టింగులతో మీరు ధైర్యం కోల్పోవద్దని, మీ డాక్టర్లకు, సిబ్బందికి తోడుగా ఉన్నామని గవర్నర్‌ వైద్యులకు భరోసా ఇచ్చారు.నేషనల్‌ డాక్టర్స్‌ డే సందర్భంగా భారత రత్న డా. బిసిరాయ్‌ చిత్రపటానిఇకి పూలమాల వేసి నివాళులర్పించారు.

Tags :
|

Advertisement