Advertisement

ఉప్పు సత్యాగ్రహం

By: chandrasekar Fri, 14 Aug 2020 10:13 AM

ఉప్పు సత్యాగ్రహం

మార్చి 12 నుండి 6 ఎప్రల్ 1930 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండి గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండీయాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా పసిద్ధి గాంచింది. దండిలో బ్రిటీష్ వారు ఉప్పుపై విధించిన సుంకానికి వ్వతిరేకంగా గాంధీగారు అతని అనుచరులు చట్టాన్ని వ్యతిరేకించి సముద్రపు నీటీ నుండి ఉప్పును వండారు. 1930 ఏప్రిల్ మాసంలో కలకత్తాలో రక్షక బటులకీ, ప్రజలకీ మధ్య హింసాత్మకమైన కొట్లాటలు జరిగాయి.

1930-31 మధ్యకాలంలో సత్యాగ్రహం కారణంగా సుమారు లక్షమంది ప్రజలు కారాగారం పాలైనారు. పెషావర్ లోని కిస్సా ఖ్వాని బజారు మారణకాండలో అనామక ప్రజలపై కాల్పులు జరిగాయి. ఈ సంఘటనతో అప్పుడే క్రొత్తగా పుట్టిన ఖుదాయి ఖిద్మత్ గార్ ఉద్యమ స్థాపకుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ సరిహద్దు గాంధీగా దేశ తెరపైకి వచ్చాడు. 1930 లో గాంధీ కారాగారంలో ఉండగా కాంగ్రెస్ కు ప్రాతినిధ్యంలేని మెదటీ రౌండ్ టేబుల్ సమావేశం లండన్ లో జరిగింది. సత్యాగ్రహం కారణంగా ఎదురైన ఆర్థిక విషమ పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ పై నిషేధం తొలగింపబడింది. గాంధీతో సహా కాంగ్రెస్ కార్యనిర్వాహణ సంఘం ప్రతినిధులు జనవరి 1931 లో విడుదలైనారు.

salt,satyagraha,ahathma,rajaji,dandi ,ఉప్పు, సత్యాగ్రహం, మెదటీ, రౌండ్, టేబుల్


1931 మార్చిలో గాంధీ ఇర్విన్ ఒప్పందం కుదిరింది, ప్రభుత్వం రాజకీయ ఖైదీలనందరినీ విడిచిపెట్టటానికి అంగీకరించింది అయితే కొందరు ముఖ్య తిరుగుబాటు దారులను విడిచిపెట్టకపోవటం, భగత్ సింగ్, అతని ఇరు సహచరులకు విధించిన మరణ శిక్షని వెనక్కి తీసుకోక పోవటంతో ఇంటా బైటా కాంగ్రెస్ మీద నిరసనలు ఏక్కువైనాయి. ప్రభుత్వ చర్యలకు బదులుగా సత్యాగ్రహాన్ని విరమించటానికి, కాంగ్రెస్ ఏకైక ప్రతినిధిగా రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనటానికి గాంధీ అంగీకరించారు. అయితే డిసెంబరు 1931లో జరిగిన ఈ సమావేశం విఫలమవ్వటంతో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చి జనవరి 1932 లో సత్యాగ్రహాన్ని తిరిగి ప్రారంభించారు.

salt,satyagraha,ahathma,rajaji,dandi ,ఉప్పు, సత్యాగ్రహం, మెదటీ, రౌండ్, టేబుల్


తరువాత కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్, ప్రభుత్వం 1935 భారత ప్రభుత్వ చట్టం పై అంగీకారం కుదిరేవరకూ ఘర్షణ-చర్చల పరంపరలో మునిగి తేలాయి అయితే అప్పటికే కాంగ్రెస్-ముస్లింలీగ్ మధ్య పుడ్చలేనంతగా అగాధం ఏర్పడి ఒకదానినినొకటి తీవ్రంగా వేలెత్తి చూపుకోసాగాయి. భారత ప్రజలందరికీ పాతినిధ్యం వహిస్తున్న సంస్థగా కాంగ్రెస్ చేస్తున్న వాదాన్ని ముస్లింలీగ్ ఖండిస్తే, భారత దేశంలోని ముస్లింలందరి వాణికి ఆకాంక్షలకీ ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్ధగా ముస్లింలీగ్ చేస్తున్న వాదాన్ని కాంగ్రెస్ త్రోసిపుచ్చింది.

Tags :
|
|

Advertisement