Advertisement

  • ఆంధ్రప్రదేశ్లోని 38 నగరాల్లోని జియో పాయింట్ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్లోని 38 నగరాల్లోని జియో పాయింట్ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభం

By: chandrasekar Sat, 29 Aug 2020 12:23 PM

ఆంధ్రప్రదేశ్లోని 38 నగరాల్లోని జియో పాయింట్ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభం


బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని 38 పట్టణాల్లోని జియో పాయింట్ స్టోర్లలో ఎలక్ట్రానిక్స్‌, గృహోపకరణాల అమ్మకాలు మొదలయ్యాయి. ఈ జియో పాయింట్ స్టోర్లలో మొబైల్స్‌, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్లు, ఇతర చిన్న గృహోపకరణాల వంటి అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలను చేపట్టనున్నట్లు జియో ఆంధ్రప్రదేశ్ సీఈఓ మండపల్లి మహేష్ కుమార్ తేలిపారు. ప్రారంభ ఆఫర్ కింద వినియోగదారులకు రూ. 1,100 విలువైన బహుమతులు, రూ. 300 విలువైన గిఫ్ట్ ఓచర్లు కచ్చితంగా లభిస్తాయని మహేష్ కుమార్ తెలిపారు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 10 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు.

ఇంటర్నెట్ సదుపాయం లేని, ఆన్‌లైన్‌లో ఎప్పుడూ షాపింగ్ చేయని వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని జియో పాయింట్ స్టోర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలోని పెద్ద నగరాలు మొదలుకొని చిన్న స్థాయి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల వరకు దేశవ్యాప్తంగా ఇప్పటికే విస్తరించి ఉన్న ఈ జియో పాయింట్ స్టోర్లు వినియోగదారుల నుంచి విశేష ఆదరణను లభిస్తుందని మహేష్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు జియో స్టోర్లలో కేవలం 4జీ మొబైల్స్, జియో సిమ్ అమ్మకాలు జరిగేవని ఇకపై ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల అమ్మకాలతో ఈ స్టోర్లు ప్రారంభించారు.

Tags :
|

Advertisement