Advertisement

  • పండుగ సీజన్ తో భారీగా పెరిగిన టాటామోటార్స్ కార్ల అమ్మకాలు

పండుగ సీజన్ తో భారీగా పెరిగిన టాటామోటార్స్ కార్ల అమ్మకాలు

By: chandrasekar Tue, 03 Nov 2020 7:02 PM

పండుగ సీజన్ తో భారీగా పెరిగిన టాటామోటార్స్ కార్ల అమ్మకాలు


దసరా, దీపావళి పండుగ సీజన్ కరోనాతో డీలా పడిన ఆటోమొబైల్ ఇండస్ట్రీకి బాగా కలిసి వచ్చింది. నిజానికి కరోనా వ్యాప్తికి ముందు నుంచే ఈ రంగం తిరోగమనంలో ఉంది. దీనికి లాక్‌డౌన్ కూడా తోడవ్వడంతో కార్ల అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. ప్రభుత్వాలు ఆంక్షలు ఎత్తివేయడంతో అమ్మకాలపై కార్ల తయారీ కంపెనీలు దృష్టి పెట్టాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు, డిస్కౌంట్‌లను కల్పించాయి. దేశీయ కంపెనీలు కూడా పండుగ సీజన్లో మంచి అమ్మకాలు సాధించాయి.

అక్టోబర్‌లో దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ వాహనాల అమ్మకాల్లో దూసుకుపోయింది. ఆ నెలలో మొత్తం దేశీయ అమ్మకాలలో 27 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. ఇండియాలో అక్టోబర్‌లో 49,669 టాటా కార్లు అమ్ముడయ్యాయి. 2019 అక్టోబర్లో కంపెనీ 39,152 వాహనాలను మాత్రమే అమ్మినట్లు తన ప్రకటనలో పేర్కొంది. టాటా మోటార్స్ నుంచి వచ్చిన ప్రయాణికుల వాహనాల అమ్మకాలు అక్టోబరులో 79 శాతం పెరిగాయి. గత సంవత్సరం అక్టోబర్‌లో 13,169 యూనిట్లను ఈ కంపెనీ అమ్మింది. ఈసారి పండుగ సీజన్లో అమ్మకాలు 23,617 యూనిట్లకు చేరుకోవడం విశేషం.

Tags :
|

Advertisement