Advertisement

యమ స్పీడులో పెరిగిన బైకుల అమ్మకాలు

By: chandrasekar Wed, 07 Oct 2020 4:32 PM

యమ స్పీడులో పెరిగిన బైకుల అమ్మకాలు


లాక్ డౌన్ కారణంగా దేశంలో అత్యధికంగా ప్రభావితమైన రంగాలలో ఆటో మొబైల్స్ కూడా ఒకటి. అప్పుడప్పుడే పుంజుకుంటున్న దశలో కరోనా రావడంతో అమ్మకాలు పడిపోయాయి. కానీ కొంతకాలంగా అన్ లాక్ ల పేరిట దేశంలో అన్ని ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతుండటం ఈ రంగంలో అమ్మకాలు పెరుగుతున్నాయి. గత నెలలో టూ వీలర్ బైక్ ల అమ్మకంలో అగ్రస్థానంలో ఉన్న యమాహా సేల్స్ ఏకంగా 17 శాతం పెరిగాయి. ఈ విషయాన్ని యమహా మోటార్స్ ఇండియా తెలిపింది. సెప్టెంబర్ లో యమహా అమ్మకాలు 17 శాతం పెరిగాయి. ఈ ఏడాది ఆగస్టు (53,727 యూనిట్లు) తో పోల్చితే సెప్టెంబర్ లో 63,052 బైకులను అమ్ముడైనట్టు యమహా పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ ల పేరిట పారిశ్రామిక కార్యకలాపాలకు అనుమతి మంజూరు చేయడంతో జూలై లోనే యమహా బైకుల అమ్మకాల్లో జోరు క్రమంగా పెరుగుతున్నది. 2019 జులైతో పోల్చితే.. ఈ ఏడాది జూలైలో యమహా అమ్మకాలు 4.3 శాతం పెరిగాయి.

2019 జులైలో 47,918 యూనిట్లు అమ్ముడవగా.. అదే ఈ ఏడాది జులైలో 49,989 యూనిట్లు సేల్ అయ్యినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఆగస్టులోనూ యిదే విధంగా కొనసాగింది. గతేడాది ఆగస్టులో 52,076 యమహా బైకులు సేల్ అవగా ఈ ఏడాదిలో 60,505 అమ్ముడు పోయాయి. ఆగస్టు మాదిరిగానే సెప్టెంబర్ లోనూ బైకుల అమ్మకాలలో పెరుగుదల కనిపించింది. కాగా, ఇక ఈ నెలలోనూ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నదని నిపుణులు అంటున్నారు. వస్తున్న రెండు నెలల్లో దేశవ్యాప్తంగా పండుగల సీజన్ రాబోతోంది. దసరా, దీపావళి, క్రిస్టమస్ వంటి పెద్ద పండుగలున్నాయి. ఆ సమయంలో చాలా మంది బైకులు కొనడానికి ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో రాబోయే రెండు నెలలలో తమ సంస్థ బైకుల అమ్మకాలు గతంలో కంటే రెట్టింపవుతాయని యమహా అభిప్రాయం. దీనిని దృష్టిలో ఉంచుకునే కొత్త మోడళ్లకు ప్లాన్ చేస్తున్నది.

యమహా ప్రస్తుతం ఫాసినో, రే జెడ్ ఆర్, స్ట్రీట్ ర్యాలీ బ్రాండ్ల పేర్లతో 125 సీసీ స్కూటర్లను అందిస్తున్నది. మోటారు సైకిళ్ల విభాగంలో 150-155 సీసీ విభాగంలో యమహా YZF-R15 3.0 వర్షెన్, యమహా MT-15, యమహా FZ-S F1 లను అందిస్తుంది. 250 సీసీ విభాగంలో యమహా FZS 25 మోడళ్లు అందుబాటులో ఉంటూ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. యమహా తో పాటు హీరో మోటోకార్ప్, హోండా మోటార్ సైకిల్స్, బజాజ్ ఆటో అమ్మకాలు పెరగగా టీవీఎస్ మోటార్స్ లో మాత్రం 0.5 శాతం అమ్మకాలు తగ్గాయి.

Tags :
|

Advertisement