Advertisement

ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి వేతనం విరాళం

By: chandrasekar Sat, 17 Oct 2020 09:48 AM

ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి వేతనం విరాళం


హైదరాబాద్ లో కురిసిన బారి వర్షాలవల్ల చాలా నష్టం ఏర్పడింది. ఇందుకుగాను ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి జీహెచ్ఎంసీ మరియు కంటోన్మెంట్ పాల‌క‌వ‌ర్గం తమ వేతనంను విరాళంగా ప్రకటించారు.ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి నెల వేత‌నం విరాళం ఇవ్వాల‌ని జీహెచ్ఎంసీ పాల‌క వ‌ర్గం నిర్ణ‌యించింది. జీహెచ్ఎంసీలో స‌హాయ చ‌ర్య‌ల నిమిత్తం విరాళం ఇవ్వాల‌ని మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్‌, కార్పొరేట‌ర్లు, కో ఆప్ష‌న్ స‌భ్యులు నిర్ణ‌యించారు. నాలుగు నెల‌ల గౌర‌వ వేత‌నాన్ని సీఎం స‌హాయ‌నిధికి ఇవ్వాల‌ని కంటోన్మెంట్ బోర్డు స‌భ్యులు నిర్ణ‌యం తీసుకున్నారు. విరాళాలు ఇస్తూ మంత్రి కేటీఆర్‌కు జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ పాల‌క‌వ‌ర్గం లేఖ రాసింది. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు హైద‌రాబాద్ న‌గ‌రం అతలాకుత‌ల‌మైన విష‌యం విదిత‌మే. న‌గ‌రంలోని లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. ఇప్ప‌టికీ ఆయా ప్రాంతాల్లో వ‌ర్ష‌పు నీరు నిలిచిపోవ‌డంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంత్రి కేటీఆర్ ఆయా బ‌స్తీల్లో ప‌ర్య‌టించి, స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌రిశీలిస్తున్నారు.

భారీ వర్షాలు పడడంతో న‌గ‌రంలో ప్రజలు తాగునీటి విష‌యంలో కొన్నిరోజులు జాగ్రత్తలు తీసుకోవాల‌ని మంత్రి కేటీఆర్ సూచించారు. కాచివ‌డ‌పోసిన నీటిని తాగ‌డం వ‌ల్ల‌ సీజ‌న‌ల్ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు అన్నారు. వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు అవ‌స‌ర‌మైన వైద్య సదుపాయాలు కల్సిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు యుద్ధప్రాతిపదికన ఇంటింటికీ బ్లీచింగ్‌ పౌడర్, క్లోరిన్‌ మాత్రలు పంపిణీ చేయాలని క్షేత్రస్థాయిలో అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. మంత్రి ఆదేశాలకు మేరకు జలమండలి అధికారులు వెంటనే పంపిణీ ప్రారంభించారు. సంపులను, ట్యాంకులను ప్రభుత్వం సరఫరా చేసే బ్లీచింగ్‌ పౌడర్‌తో శుభ్రం పరుచుకోవాలని, సరఫరా చేసే తాగునీటిలో క్లోరిన్‌ మాత్రలు కలుపుకొని వాడుకోవాలని జలమండలి సూచించింది. ఇందువల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని తెలిపారు.

Tags :
|

Advertisement