Advertisement

  • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతం బకాయిలు ఈ నెల నుంచే ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతం బకాయిలు ఈ నెల నుంచే ప్రారంభం

By: chandrasekar Thu, 01 Oct 2020 09:41 AM

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతం బకాయిలు ఈ నెల నుంచే ప్రారంభం


కరోనా వల్ల ప్రభుత్వం జీతాలతో కొత్త విధించిన విషయం తెలిసిందే. ఈ నెల నుండి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతం బకాయిలు చెల్లించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపికబురు అందించింది. కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో తగ్గించిన జీతాలు, పెన్షన్ల మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్టు ప్రకటించింది. దసరా పండుగకు ముందు ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాల్లో సంతోషాన్ని నింపింది. బకాయిల చెల్లింపులు ఈ నెల నుంచే ప్రారంభం కానున్నాయి. పెన్షనర్లకు రెండు విడుతల్లో, ఉద్యోగులకు నాలుగు విడుతల్లో చెల్లింపులు చేస్తారు. ఈ మేరకు ఆర్థికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా ఆర్ధిక సమస్యతో జీతాలతో ప్రభుత్వం కొత్త విధించింది. ఉద్యోగులు, పింఛన్‌దారులకు మార్చి, ఏప్రిల్‌, మే నెలల బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా గాడిన పడుతుండటం, ఆదాయం పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కరోనా విజృంభణ, లాక్‌డౌన్‌తో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌ చెల్లింపుల్లో కొంత మేర తాత్కాలికంగా నిలుపుదలచేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో నిర్ణయం తీసుకున్నది.

ఇందువల్ల రాష్ట్రంలోని సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75% నిలిపివేసింది. అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ ఉద్యోగుల జీతాల్లో 60%, మిగతా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 50%, నాలుగో తరగతి, కాంట్రాక్ట్‌/ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల్లో 10% చెల్లింపులు నిలిపివేశారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు అందించే పెన్షన్లలో 50%, నాలుగో తరగతి ఉద్యోగుల పెన్షన్లలో 10% ఆపారు. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో జీతాల్లో పైన పేర్కొన్న శాతాల్లో జీతాలు బకాయి ఉన్నది. జూన్‌లో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమై, ఆదాయం మెరుగుపడటంతో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తిరిగి పూర్తి జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నారు.

ఇప్పుడు ఆర్ధికంగా పుంజుకోవడంతో తాజాగా ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిలను ఈ నెల నుంచే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షనర్లకు రెండు విడుతల్లో అక్టోబర్‌, నవంబర్‌లో చెల్లింపులు జరుపనున్నారు. ప్రభుత్వ, కాంట్రాక్ట్‌ /ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు నాలుగు విడుతల్లో అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌, వచ్చే ఏడాది జనవరి నెలల్లో వారి ఖాతాల్లో బకాయిలు జమకానున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతన బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంపై టీఎన్జీవో కేంద్ర సంఘం హర్షం వ్యక్తంచేసింది. ఉత్తర్వులు జారీచేసినందుకుగాను సీఎం కేసీఆర్‌కు సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇందువల్ల ఉద్యోగుల్లో ఆనందాన్ని చూడవచ్చు.

Tags :

Advertisement