Advertisement

  • జుట్టు తెల్లబడిన అందంగా ఉన్నావు ..ధోనికి బర్త్ డే విషెస్ చెప్పిన సాక్షి ధోని

జుట్టు తెల్లబడిన అందంగా ఉన్నావు ..ధోనికి బర్త్ డే విషెస్ చెప్పిన సాక్షి ధోని

By: Sankar Wed, 08 July 2020 10:21 AM

జుట్టు తెల్లబడిన అందంగా ఉన్నావు ..ధోనికి బర్త్ డే విషెస్ చెప్పిన సాక్షి ధోని



మహేంద్ర సింగ్ ధోని 39 వ బర్త్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు , ఇతర క్రికెటర్లు , మాజీ ఆటగాళ్లు ఇలా అందరూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు ..ఈ క్రమంలో అతని భార్య సాక్షి కూడా సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్తూ.. ధోనీ మరింత స్వీట్‌గా తయారయ్యాడంటూ కితాబిచ్చింది. అంతేకాకుండా తియ్యనైన మాటలకి, గిప్ట్స్‌కి పడిపోయే నైజం నీది కాదంటూ తన భర్త గురించి చెప్పకనే చెప్పింది.

ధోనీ నీకు ఇంకో ఏడాది వయసు పెరిగింది.. సూచికగా జుట్టు కూడా ఇంకొంచెం తెల్లబడింది. కానీ.. చాలా స్మార్ట్, స్టీట్‌గా తయారయ్యావు (నిజంగా). ఇలాంటి తియ్యనైన మాటలు, గిప్ట్స్‌కి నువ్వు పడిపోవు. కేట్ కట్‌ చేసి, కొవ్వొత్తులని వెలిగించడం ద్వారా మరో ఏడాది పుట్టిన రోజు వేడుకలు జరుపుకుందాం..అని విషెస్ చెప్పింది.

గత ఏడాది సరిగ్గా ఇదే సమయానికి ధోని ఇంగ్లాండ్ లో ప్రపంచ కప్ లో పాల్గొంటున్నాడు ..అయితే ఆ టోర్నీ లో టీమిండియా అనూహ్యంగా సెమిస్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలు అయింది ..దీనితో అప్పటి నుండి ధోని క్రికెట్ కు దూరమయ్యాడు ..ఇప్పటికే ధోని మైదానంలోకి దిగాక ఏడాది అయిపోతుంది ..అయినా కూడా ధోని కెరీర్ మీద ఎవరికీ క్లారిటీ లేదు ..తన భార్య సాక్షి చెప్పినట్లే ధోని ఎవ్వరి మాటలకూ రియాక్ట్ అవ్వడు..తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు తప్ప తన మీద వచ్చే ఏ వ్యాఖ్యలకు అయినా తాను స్పందించడు .. మరి ఇప్పటికయినా ధోని తన కెరీర్ గురించి క్లారిటీ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు ..



Tags :
|
|
|

Advertisement