Advertisement

  • మీ టూ ఉద్యమం వలన ఆ సీన్ చేయకుండా తప్పించుకున్న ...సాయి పల్లవి

మీ టూ ఉద్యమం వలన ఆ సీన్ చేయకుండా తప్పించుకున్న ...సాయి పల్లవి

By: Sankar Sun, 13 Dec 2020 8:00 PM

మీ టూ ఉద్యమం వలన ఆ సీన్ చేయకుండా తప్పించుకున్న ...సాయి పల్లవి


సౌత్ ఇండియాలో తన సహజ నటనతో అభిమానులను అలరిస్తున్న హీరోయిన్ సాయి పల్లవి..కెరీర్‌ ఆరంభం నుంచే ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ కేవలం తన నటనతోనే ‘ఫిదా’ చేసి కోట్లాది మంది అభిమానులను సంపాధించుకుంది..అయితే తనతో ఒక దర్శకుడు లిప్ లాక్ చేయించాలని చూస్తే ఎలా తప్పించుకున్నధో ఒక ఇంటర్వ్యూ లో వివరించింది..

ఓ దర్శకుడు తనతో ముద్దు సీన్‌ చేయించాలని ట్రై చేశాడని.. కానీ తనకు అటువంటి సీన్‌లో నటించడం కంఫర్ట్‌గా అనిపించదని దర్శకుడికి చెప్పేశానని తెలిపింది. ‘ఓ సినిమాలో రొమాంటిక్‌ సీన్‌లో నటించేటప్పుడు హీరో పెదవులపై ముద్దు పెట్టాలని దర్శకుడు సూచించాడు.

అయితే లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించడం నాకు కంఫర్ట్‌గా అనిపించదని దర్శకుడికి చెప్పేశాను. ఆ సమయంలో మీటూ ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆ సీన్ చేయమని సదరు దర్శకుడు బలవంత పెట్టలేదు. అలా 'మీటూ' కారణంగా లిప్‌లాక్‌ సీన్‌ నుండి తప్పించుకున్నాను’ అని సాయిపల్లవి చెప్పుకొచ్చింది

Tags :

Advertisement