Advertisement

  • బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో సాయి , దేవరాజ్ అరెస్ట్

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో సాయి , దేవరాజ్ అరెస్ట్

By: Sankar Sun, 13 Sept 2020 8:07 PM

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో సాయి , దేవరాజ్ అరెస్ట్


బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు విచారణలో ఆదివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తొలి నుంచీ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్‌, సాయిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతేకాకుండా మూడో వ్యక్తి ఆర్‌ఎక్స్‌ 100 సినీ నిర్మాత అశోక్‌ రెడ్డిని సైతం సోమవారం విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోనున్నారు. ఈ ముగ్గురిని రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.

ఆదివారం విచారణలో భాగంగా శ్రావణి కుటుంబ సభ్యులతో పాటు సాయిల స్టేట్‌మెంట్‌ను‌ నమోదు చేశారు. దీనిలో భాగంగానే కేసును మరింత లోతుగా విచారించాలని భావించిన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు సాయితో పాటు దేవరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అన్ని కోణాల్లో అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. కీలక ఆధారాలు లభ్యమైయ్యే వరకు ముగ్గురు అనుమానితులూ తమ అదుపులోని ఉంటారని పోలీసులు తెలిపారు.

అయితే కేసు విచారణలో భాగంగానే శ్రావణి కుటుంబ సభ్యులు పలు కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. తమ కుమార్తె మరణానికి దేవరాజే కారణమని పోలీసులతో చెప్పినట్లు సమాచారం. అయితే దేవరాజ్‌ మాత్రం సాయి వేధింపుల కారణంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని వాదిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు లభించిన సాక్ష్యాలు, ఆడియో రికార్డులను పోలీసులు మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. అయితే ఆదివారం నాటి విచారణతో కేసు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లే తెలుస్తోంది

Tags :
|
|

Advertisement